కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి... కవలలు కూడా...

Published : Feb 21, 2022, 07:06 AM IST
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి... కవలలు కూడా...

సారాంశం

పచ్చని కుటుంబాన్ని ఒక్కసారిగా వ్యాన్ రూపంలో మృత్యువు కబలించింది. కాకినాడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కవలలు సహా తల్లిదండ్రులు మృతి చెందగా, మరో చిన్నారి మృత్యువులో పోరాడుతోంది.

కాకినాడ : ఆరోగ్యం బాగాలేని అత్తను పరామర్శించడానికి బయలు దేరింది ఆ family. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదలడం ఎందుకులే అనుకుని twins సహా మరో చిన్నారితో బండిపై బయలు దేరింది. సరదాగా సాగిపోతున్న వారి ప్రయాణాన్ని.. ఓ వ్యాన్ మృత్యువు రూపంలో వెంబడించింది. బండిని కొట్టడంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా చిన్నాభిన్నం అయిపోయింది. దంపతులతో పాటు కవలలిద్దరూ మృతి చెందగా, మరో చిన్నారి కొనఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. 

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వారధిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర road accidnetలో ఒకే కుటుంబానికి చెందిన four members మృతిచెందగా.. చిన్న కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని గుత్తినదీవి గ్రామానికి చెందిన మోటార్ మెకానిక్ వైదాడి కుమార్ (35), భార్య పద్మ (31), కుమారుడు సత్యవర్మ (10), కుమార్తెలు హర్షిత (10) సాత్విక (సిరి వదన)తో కలిసి ద్విచక్ర వాహనంపై కాకినాడ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టింది. 

ఘటనలో కుమార్, పద్మ, సత్య వర్మ  అక్కడికక్కడే మృతి చెందారు.  హర్షిత కాకినాడలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్ర గాయాలపాలైన వారి చిన్న కుమార్తె ఎనిమిదేళ్ల సాత్వికకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని doctors తెలిపారు. అనారోగ్యంతో ఉన్న అత్తను పరామర్శించేందుకు కుమార్.. భార్య, ముగ్గురు పిల్లలతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో సత్యవర్మ, హర్షిత కవలలు. ప్రమాదానికి కారణమైన వ్యానును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, nellore జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల వద్ద గత బుధవారం రాత్రి ఘోర road accident జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చింతవరం నుంచి గూడూరు వైపు వెళ్తున్న autoను..  వరగలి క్రాస్ రోడ్డు వద్ద చింతవరం వస్తున్న lorry ఢీకొంది. అప్పటికీ ఆగకుండా ఆటోను లాక్కుంటూ కొద్ది దూరం వెళ్ళింది.  ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా…  గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ సుధాకర్ (50) అందులోనే ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. మిగిలిన ఇద్దరూ లారీ చక్రాల కింద పడి తనువు చాలించారు. 

వీరిని గూడూరు మండలం చెన్నూరు దళితవాడకు చెందిన మాతంగీ రాజశేఖర్ (27), నందిపాక హరి సాయి(50)గా గుర్తించారు. వీరిద్దరూ అవివాహితులు. ఏజెన్సీలో రెండేళ్లుగా పని చేస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో సంస్థకు సంబంధించిన సరుకులను దుకాణాలకు వేసి.. ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది.

చేతికి అందివచ్చిన బిడ్డలు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. శోకసంద్రంలో మునిగినవారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. గూడూరు గ్రామీణ సిఐ శ్రీనివాసరెడ్డి, చిల్లకూరు, మనుబోలు ఎస్సైలు సుధాకర్ రెడ్డి, ముత్యాలరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆటో నెంబర్ ఆధారంగా మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu