అచ్చు ఖాకీ సినిమానే: కంజర్‌భట్స్ గ్యాంగ్‌ అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 15, 2019, 1:45 PM IST
Highlights

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సెల్‌ఫోన్ లారీ దోపీడీని పోలీసులు చేధించారు.నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

నెల్లూరు: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అత్యంత కిరాతకులైన కంజర్ భట్స్ గ్యాంగ్ ను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ ను పట్టుకొన్న పోలీసులను ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అభినందించారు. తెలుగులో ఖాకీ సినిమాలో మాదిరిగానే దొంగలు వ్యవహరించారు.తెలివిగా వ్యవహరించిన దొంగలను పోలీసులు పట్టుకొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన శ్రీసీటి సెజ్ నుండి జియోమీ రెడ్ మీ సెల్‌ఫోన్ల లోడుతో వెళ్తున్న ఐషర్ కంటైనర్ ను 16వ నెంబర్ జాతీయ రహదారిపై దగదర్తి వద్ద కంజర్ భట్స్ గ్యాంగ్ అడ్డగించి డ్రైవర్ ను చితకబాది లారీని తీసుకెళ్లింది.

 లారీలో ఆ సమయంలో  రూ. 4.8 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు ఉన్నాయి.  ఈ సెల్‌పోన్లను మరో లారీకి లోడ్ చేసి ఖాళీ కంటైనర్ ను కావలి సమీపంలోని గౌరవరం వద్ద విడిచివెళ్లారు. బాధిత డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

అనంతపురం జిల్లా కనగానపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ లారీని దొంగిలించి డ్రైవర్ ను హత్య చేశారు. చిత్తూరు జిల్లా గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడ ఇదే తరహా కేసు నమోదైంది.  తమిళనాడు లోని వేలూరు జిల్లా పల్లికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లారీని దొంగిలించి డ్రైవర్ ను హత్య చేసేందుకు నిందితులు ప్రయత్నించారు.ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించి ఈ దోపీడీకి పాల్పడ్డారు.

నెల్లూరు నుంచి హైదరాబాదు మీదుగా మద్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరకు నేరానికి ఉపయోగించిన లారీలను ట్రాక్‌ చేశారు. అన్ని టోల్‌గేట్లలో సీసీ ఫుటేజ్‌లను స్కాన్‌ చేశారు.నెంబరులేని కొత్త కారును గుర్తించి ఆ కారే రెక్కీ చేసినట్లు, పైలెట్‌ వాహనంగా వ్యవహరించినట్లు నిర్ధారించుకున్నారు.

 ఆ కారు ఏ ప్రాంతానికి చెందిందో తెలుసుకొనేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. మొత్తం మీద ఎస్పీ కారుకు కట్టి ఉన్న రిబ్బన్ల ఆధారంగా ఆ వాహనం యొక్క ఆచూకీ గుర్తించారు. వెంటనే పోలీస్‌ టీమ్‌లు మధ్యప్రదేశ్‌కు వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉండి ఈ నేరానికి పాల్పడింది కంజర్‌భట్స్‌ గ్యాంగ్‌ సభ్యులుగా గుర్తించారు. 

 ఈ ఏడాది మే నెల 3వ తేదీన గ్యాంగ్‌లోని ఇసుకేష్ హడా, సంతోష్‌ల ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దొంగిలించిన సెల్‌ఫోన్లను ఇండోర్‌కు చెందిన అంకిత్‌శ్రీ వాత్సవ్‌, పవన్‌ చౌదరీలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్‌, రిసీవర్‌ అయినా షేక్‌ హమీదుజ్జామన్‌ అలియాస్‌ రీతు కొన్నట్లు ధృవీకరించారు.హమీద్ హైద్రాబాద్ లో ఉన్న సమయంలో అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ వివరించారు. 


 

click me!