పంద్రాగస్టు వేడుకలు..టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణ

Published : Aug 15, 2019, 12:24 PM IST
పంద్రాగస్టు వేడుకలు..టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణ

సారాంశం

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సాములు పెద్ద ఎత్తున అనుచరులతో తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో... టీడీపీ, వైసీపీ కార్యకర్తలు తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.


పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో... చీరాలలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రసాభాసగా మారాయి.  ఇంతకీ మ్యాటరేంటంటే.... పంద్రాగస్టు వేడులకల్లో పాల్గొనేందుకు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు.

కాగా.. అక్కడ ఆయనను వైసీపీ  శ్రేణులు అడ్డుకున్నారు. ఆయన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వీలు లేదంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ కొద్ది సేపటికే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సాములు పెద్ద ఎత్తున అనుచరులతో తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో... టీడీపీ, వైసీపీ కార్యకర్తలు తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.

ప్రధాన గేటు వద్ద టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కలగజేసుకొని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపివేశారు. ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి మాత్రం తహశీల్దార్ కార్యాలయంలోనే ఉండటం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?