దేశం కోసం నిలబడే పార్టీ జనసేన: పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Aug 15, 2019, 12:04 PM IST
Highlights


స్వాతంత్య్ర దినోత్సవం వారం రోజుల పాటు చేయాలన్నదే తన కల అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 కన్నా వారం రోజుల ముందు నుంచే స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు నిర్వహించాలని కోరారు.15 నిమిషాలు జాతీయ జెండా ఎగుర వేయగానే సరిపోదని వ్యాఖ్యానించారు.  

అమరావతి:  దేవుడి కన్నా దేశాన్నే ఎక్కువగా నమ్ముతానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశం కోసం నిలబడే పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమేనని పవన్ స్పష్టం చేశారు. 

73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ దేశ చరిత్ర తెలిసిన నాయకులెవరూ అవినీతి, అరాచకాలు, అన్యాయం చేయరని చెప్పుకొచ్చారు.  

కులాలు,మతాలు, ప్రాంతాలు, జాతులు, చరిత్ర మీద పుస్తకాలు రాసే వారు ఉన్నారు గానీ, దేశ చరిత్ర మీద పుస్తకాలు రాసే వారు మాత్రం కనుమరుగయ్యారంటూ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

స్వాతంత్ర్య దినోత్సవం వారం రోజుల పాటు చేయాలన్నదే తన కల అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 కన్నా వారం రోజుల ముందు నుంచే స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు నిర్వహించాలని కోరారు.15 నిమిషాలు జాతీయ జెండా ఎగుర వేయగానే సరిపోదని వ్యాఖ్యానించారు.  

జాతీయ జెండాను ఆవిష్కరించిన వారిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకున్నారు. 

click me!