వర్మకు పవన్ మీద కోపమొచ్చింది

Published : Jan 27, 2017, 07:45 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
వర్మకు పవన్ మీద కోపమొచ్చింది

సారాంశం

సినిమాలలో ఉంటూన్నా తెలుగువాళ్ల వ్యవహారాలన్నింటిని, ముఖ్యంగా రాజకీయాలను, జాగ్రత్త గమనించే ఒకే ఒక్కడు వర్మ.

రామ్ గోపాల్ వర్మకు పవన్ కల్యాణ్ మీద కోపం మొచ్చింది.

 

తనేదో అభిమానిగా రాజకీయాభిప్రాయం వెలిబుచ్చితే, దానిని వ్యక్తి గతంగా తీసుకుని ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడటం సబబుకాదు,ఇక చాలు నీకు గుడ్ బై అనేశారు ట్విట్టర్ లో.

 

వర్మ నిర్మొహమాటానికి మారు పేరు. నిజానికి అదే అసలు పేరేమో. వర్మ అనేదో మారుపేరు.

 

సినిమాలలో ఉంటూన్నా తెలుగువాళ్ల వ్యవహారాలన్నింటిని, ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలను జాగ్రత్త గమనించే ఒకే ఒక్కడు వర్మ.

 

చాలా మందికి రాజకీయాల్తో అనుబంధం ఉంటుంది. కులమో , బంధుత్వమో, ప్రాంతమో ఏదో ఒకటి ప్రతి తెలుగువాడిని రాజకీయాలకు దగ్గిర చేస్తుంది.

 

అయితే, వాళ్లెవరూ ఇంత బాహాటంగా రాజకీయాభిప్రాయాలువ్యక్తం చేయరు.  వ్యక్తీకరణ నష్టం కల్గిస్తుందని వారికి తెలుసు. అయితే, వర్మ డిఫరెంట్. నాజూకయిన మహేష్ బాబు కళ్లు డబ్బింగ్ మార్కెట్ మీదే ఉన్నాయని రఫ్ ఆడించిన వాడు వర్మ.

 

అలాగే ట్విట్టర్ చాటున దాకుంటే ఎలా యుద్దభూమిలోకి రావయ్య మగడా అని పవన్ కి చురక వేసి,  జగన్ రాజకీయ సమయస్ఫూర్తి ని ప్రశంసించారు. నిజంగానే నిన్న రోజంతా జగన్ దే... ఇది పవన్ కు ఇబ్బంది కలిగించింది. నిజానికి ఈ  విలేకరుల సమావేశం దానికి సంజాయిషీ.  ఇందులో తన కుటుంబంమీద పవన్ చేసిన వ్యాఖ్యలకు వర్మ ట్విట్టర్ లో స్పందించారు.

 

ఆయనకు, భార్యకు, పిల్లలకు,కుటుంబానికి , ఆయన నడిపే జనసేన పార్టీకి, ఆయన  అభిమానులకు శుభాకాంక్షలు

 

ఇవి ఆయన ట్వీట్లు :

 

* నేను తన మీద ఇష్టంతో నిజాయితీగా మాట్లాడాను గాని క్రిటిసైజ్  చేయడానికి కాదని తాను తెలుసుకోకపోవడం నా దురదృష్టం

 

* వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడారని యండమూరిని తిట్టారు. మరి వాళ్లు వేరే ఇంట్లో వాళ్ల గురించి  మాట్లాడొచ్చా? ఇదే వికాసం?

 

* నా జీవితం, నా లైఫ్ స్టయిల్, నేనాలోచించే విధానం, దాక్కోకుండా, దాచుకోకుండా నా పుస్తకం,నా ఇష్టంలో మొత్తం విప్పి విప్పి రాశాను.

* ఒక అభిమానిగా పికె మీద ఎక్స్ పెక్టేషన్స్తో మాట్లాడాను గాని, తాను చేసుకున్న మూడు పెళ్లిళ్ల లాంటి పర్సనల్ విషయాలను నేనెప్పుడూ మాట్లాడలేదు.

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?