కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఆ అంశాలపై చర్చ..

Published : May 07, 2022, 05:24 PM IST
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఆ అంశాలపై చర్చ..

సారాంశం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి‌తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భేటీ అయ్యారు. అధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం శనివారం విశాఖకు వచ్చిన కిషన్‌రెడ్డిని మంత్రి రోజా కలిశారు. 

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి‌తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భేటీ అయ్యారు. అధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం శనివారం విశాఖకు వచ్చిన కిషన్‌రెడ్డిని మంత్రి రోజా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి, గొప్ప సంస్కృతిని ప్రోత్సహించడానికి సంబంధించిన విషయాలను వారు చర్చించారు. ఇందుక సంబంధించి ఫొటోలను కిషన్ రెడ్డి కార్యాలయం ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

ఇక, విశాఖలో అల్లూరి విగ్రహానికి  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏడాది పాటు వాడవాడాలా ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ రోజు అల్లూరి వర్ధంతి సందర్భంగా నివాళులార్పిస్తున్నామని అన్నారు. 

మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి వర్దంతి సందర్భంగా పెద్ద వాళ్లంతా ఇక్కడికి వచ్చి నివాళులర్పించడం జరిగిందన్నారు. అల్లూరి పేరు పేరు వింటే రొమాలు నిక్క పొడుచుకుంటాయన్నారు.  ఆయన బతికింది 27 ఏళ్ళకే అమరుడైనా 27 తరాలు గుర్తుపెట్టుకునేలా స్పూర్తిగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఈరోజు ఆయన పేరును ఓ జిల్లాకు పెట్టుకోవడం జరిగిందన్నారు. అల్లూరి మరణించి 100 ఏళ్లు అయినా ఆయనుకు మరణం లేదన్నారు. 

అల్లూరి ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన ఉందని తెలిపారు. అల్లూరి పేరుతో జిల్లా, మన్యం ప్రజల హక్కులు, ఉపాధి , విద్య కోసం అల్లూరి కన్న కలలను సీఎం జగన్ సాకారం చేస్తున్నామని అన్నారు. అల్లూరి మ్యూజియం కు 22ఎకరాల స్థలం కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి మ్యూజియం కట్టడానికి సహకరిస్తున్న కిషన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?