జీవిత ఖైదీలకు శుభవార్త: ఈ అర్హతలుంటే విడుదలే.. ఏపీ సర్కార్ కసరత్తు

By Siva KodatiFirst Published Aug 27, 2020, 4:00 PM IST
Highlights

జీవిత ఖైదు అనుభ‌విస్తున్న ఖైదీల‌కు ప్ర‌త్యేక అనుమ‌తితో విడుద‌ల చేయాలని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఖైదీల ఎంపిక‌కు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించింది. 

జీవిత ఖైదు అనుభ‌విస్తున్న ఖైదీల‌కు ప్ర‌త్యేక అనుమ‌తితో విడుద‌ల చేయాలని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఖైదీల ఎంపిక‌కు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించింది.

కుటుంబ స‌భ్యుల విన‌తులు,వ‌య‌సు మీద ప‌డిన‌వారికి,కొన్నేళ్లు శిక్ష పూర్తిచేసుకున్న స‌త్ర్ప‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీల‌కు ఉపశమనం కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్ల‌లో నిబంధ‌న‌ల ప్ర‌కారం ఖైదీల గుర్తింపుకు ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేసింది.

హోంశాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అధ్య‌క్ష‌త‌న మ‌రో ఐదుగురు స‌భ్యుల‌తో ఈ కమిటీని నియమించింది. క‌మిటీలో స‌భ్యులుగా న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శి,డీజీపీ,సీఐడీ లీగ‌ల్ అడ్వైజ‌ర్,ఇంటిలిజెన్స్ ఏడీజీ, క‌న్వీన‌ర్ గా జైళ్ల‌శాఖ డీజీ వ్యవహరిస్తారు.

click me!