అనుమానం.. భార్య కాళ్లు, చేతులు నరికేసిన భర్త

Published : Aug 27, 2020, 02:24 PM IST
అనుమానం.. భార్య కాళ్లు, చేతులు నరికేసిన భర్త

సారాంశం

భార్య ప్రవర్తన మీద వెంకటేష్ కి అనుమానం మొదలైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో కత్తి తో దాడి చేశాడు

ప్రేమగా చూసుకోవాల్సిన భార్య పై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం పెనుభూతంగా మారిపోయింది. ఈ క్రమంలో మనిషి అనే విషయాన్ని మర్చిపోయి మృగంలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యపై కిరాతకానికి పాల్పడ్డాడు.. భార్య కాళ్లు, చేతులు నరికేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాకహస్తిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ అనే యువకుడికి ఆరు నెలల క్రితం నెల్లూరు కి చెందిన దుర్గను పెళ్లి జరిగింది. కాగా.. కొంతకాలం వారి అన్యోన్యంగానే ఉన్నారు. కాగా.. ఇటీవల భార్య ప్రవర్తన మీద వెంకటేష్ కి అనుమానం మొదలైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో కత్తి తో దాడి చేశాడు. అనంతరం శ్రీకాళహస్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ దుర్గ ప్రస్తుతం నెల్లూరు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu