తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూములు: సీబీఐకి ఏపీ హైకోర్టు నోటీసులు

Published : Aug 27, 2020, 01:55 PM IST
తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూములు: సీబీఐకి ఏపీ హైకోర్టు నోటీసులు

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలోని అవ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సీబీఐకి ఏపీ హైకోర్టు గురువారం నాడు నోటీసులు జారీ చేసింది.   


అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలోని అవ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సీబీఐకి ఏపీ హైకోర్టు గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. 

తూర్పు గోదావరి జిల్లాలోని అవ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ చేసింది.  ఈ భూముల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని పిటిషనర్ ఆరోపించారు.

భారీ వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో అవభూములు ముంపుకు గురి కానున్నాయని పిటిషన్ చెప్పారు. ఈ తరహా భూములను పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించారని పిటిషన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  అవ భూములు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని మీడియాలో వచ్చిన కథనాలను కూడ పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ భూముల కొనుగోలులో సీబీఐ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. దీంతో ఏపీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu