10 రూపాయల నాణేలు చెల్లుతాయి

First Published Apr 11, 2017, 12:48 PM IST
Highlights

కొత్త 10 రూపాయల నాణేలతో పాటు పాతవి కూడా చెల్లుబాటవుతాయని స్పష్టంగా ఆర్బిఐ పేర్కొంది.

పది రూపాయల చెల్లుబాటుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రిజర్వ్ బ్యాంకు ఖండిచింది. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో పది రూపాయల నాణేల చట్టబద్ధతపై ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అన్నీ చోట్లా 10 రూపాయల నాణేలు చెల్లుతాయని ఆర్బిఐ ప్రకటించింది. ప్రతీ లావాదేవీలోనూ నాణేలు చెల్లుతాయని చెప్పింది.

భారత ప్రభుత్వ టంకశాలల్లో తయారైన నాణెములను రిజర్వు బ్యాంకు చలామణి లోకి తెస్తుంది. ఈ నాణెలు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రజల లావాదేవీల అవసరాలను తీర్చడంకోసం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విషయాలను ప్రతిబింబించే కొత్త డిజైన్, కొత్త డినామినేషన్లలో నాణేలను తరచుగా ప్రవేశపెడుతున్నట్లు ఆర్బీఐ పేర్కొన్నది. నాణేలు చాలా కాలం చలామణిలో ఉంటాయి కాబట్టి ఒకే సమయములో వివిధ డిజైన్లు, వివిధ ఆకృతులు కలిగిన నాణేలను చెలామణిలో ఉండవచ్చని చెప్పింది.

2011  జూలై లో రూపాయి చిహ్నాన్ని ప్రవేశపెట్టడం కూడా ఇలాంటి మార్పుగానే జనాలు గమనించాలని విజ్ఞప్తి చేసింది. కాబట్టి కొత్త 10 రూపాయల నాణేలతో పాటు పాతవి కూడా చెల్లుబాటవుతాయని స్పష్టంగా ఆర్బిఐ పేర్కొంది.

click me!