రాజ్యసభ: ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే

First Published Apr 11, 2017, 9:54 AM IST
Highlights

చాలకాలం తర్వాత జరిగిన చర్చలో వక్తలందరూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేయట విశేషం. అదే సమయంలో జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డిసి) సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేయటం గమనార్హం. 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ పలువురు ఎంపిలు రాజ్యసభలో ఎలుగెత్తారు. ఈరోజు రాజ్యసభలో కాలింగ్ అటెన్షన్ రూపంలో ఏపికి ప్రత్యేకహోదాపై చర్చ జరిగింది. చాలకాలం తర్వాత జరిగిన చర్చలో వక్తలందరూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేయట విశేషం. వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ కు చెందిన కెవిపి రామచంద్రరావు, తెలంగాణా కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, టిఆర్ఎస్ కు సభ్యుడు కె. కేశవరావు, సిపిఐ కి  చెందిన డి. రాజా, కాంగ్రెస్ సభ్యుడు, మాజీ మంత్రి జైరాం రమేష్, కాంగ్రెస్ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి, గులాం నబీ ఆజాద్ తదితరులందరూ ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేసారు.

అదే సమయంలో జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డిసి) సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేయటం గమనార్హం. ప్రత్యేకహోదాపై ఎస్డీసీ అభిప్రాయాన్ని తీసుకోవాలని కూడా సభ్యులందరూ సూచించారు. యూపిఏ హయాంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని చేసిన నిర్ణయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కాలరాయటం మంచిది కాదన్నారు సభ్యులు. రాజ్యసభలో ప్రధాని చేసిన ప్రకటనకే ఎన్డీఏ విలువ ఇవ్వకపోతే ఎలాగంటూ సభ్యులు కేంద్రప్రభుత్వాన్ని నిలదీసారు. ప్రభుత్వ చర్యను సమర్ధించుకోవటానికి మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ బాగా ఇబ్బంది పడ్డారు.

click me!