రాయపాటి మనసు గాయపడిందట

Published : May 19, 2017, 04:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
రాయపాటి మనసు గాయపడిందట

సారాంశం

తెలుగుదేశం  నర్సరావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావుమనసు గాయపడిందట. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లుగా తెలుగుదేశం వర్గాల్లో  ప్రచారంలోఉన్న ఒక పదునైన కామెంట్ ఆయన చెవినిపడిందని,  దాని తో ఆయన తవ్రంగా నొచ్చుకుని, ముఖం చాటేస్తున్నారని  తెలిసింది.‘కాంట్రాక్టులు, పదవులు రెండు కావాలంటే, ఎట్లా? ఇంక ఎవరూ పార్టీలో లేరా, కుదరదు,’ అని చంద్రబాబు రాయపాటి గురించి అన్నట్లు తెలుగుదేశం వర్గాల్లో వినపడుతూ ఉంది.

తెలుగుదేశం  నర్సారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు మనసు గాయపడిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

 

 చంద్రబాబు అన్నట్లుగా తెలుగుదేశం వర్గాల్లో  ప్రచారంలోఉన్న ఒక పదునైన కామెంట్ ఆయన చెవినిపడిందని,  దాని తో ఆయన తవ్రంగా నొచ్చుకుని, ముఖం చాటేస్తున్నారని  తెలిసింది.

 

‘కాంట్రాక్టులు, పదవులు రెండు కావాలంటే, ఎట్లా? ఇంక ఎవరూ పార్టీలో లేరా, కుదరదు,’ అని చంద్రబాబు రాయపాటి గురించి అన్నట్లు తెలుగుదేశం వర్గాల్లో వినపడుతూ ఉంది.

 

పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, గాని ఇలాంటి  వ్యాఖ్యలను నాయకుడు ఇతరతో అనడం భావ్యమా అని రాయపాటి భాదపడుతున్నారట.

 

అసలేం జరిగిందంటే...

 

 టీటీడీ ఛైర్మన్ పదవికోసం రాయపాటి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎంపిగా ఇంతకాలం పనిచేశాక, ఒక రౌండు శ్రీవారికి కూడ సేవలందించి తరించాలని రాయపాటి కోరిక.  సాధారణంగా వడ్డికాసుల వాడి పాలకమండలి అధ్యక్ష  పదవిని బిజినెస్ పీపుల్ కే ఇస్తారు. ఇదొక సంప్రదాయం అయిపోయింది. గత అయిదారు ఛెయిర్మన్లను చూస్తే, వారంతా కాంట్రాక్టర్లు, లిక్కర్ బిజినెస్ చేసినవాళ్లే. కాంట్రాక్టులలో ఎవరికీ తీసిపోడు కాబట్టి, రాయపాటి కూడా టిటిడి మీద కన్నేశాడు. దానికితోడు చంద్రబాబు  కులం, ఈయన కులం ఒకటే కదా. మరింత ఆశపడ్డాడు.

 

ముఖ్యమంత్రిని చాలాసార్లు కలసి శ్రీవారికి సేవచేయాలనుకుంటున్నట్లు తన కోరికను కూడా వెల్లడించారు. చాలా మందికులబాంధువులు కూడా ముఖ్యమంత్రికి  సిఫార్సుకూడా చేశారట. ఏమయిందో ఏమో, అన్ని అర్హతలున్న రాయపాటి పేరుతో చెబితేనే,చంద్రబాబుముఖం చిట్లిస్తున్నాడట.

 

అంతే, ఒకరూల్ తయా రుచేసేసినట్లు,ఎంపిలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేదిలేదన్నాడట.

 

అంతటితో ఆగకుండా,‘ కాంట్రాక్టులు కావాలా, పదవులు కావాలంటే ఎలా, ఇంక పార్టీలో ఎవరూ లేరా,’  అనికూడా ముఖ్యమంత్రి అన్నాడట.

 

ఇది రాయపాటికి నచ్చడం లేదని అంటున్నారు.

 

రాయపాటి మిత్రులు, చంద్రబాబు సన్నిహితులు ఈ వ్యవహారాన్ని తెలికగా తీసిపడేస్తున్నారు. రెండురోజులు పోతే, అన్ని సర్దుకుంటాయి. రాయపాటి, చంద్రబాబు మంచిమిత్రులు  అని కూడా కొందరంటున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu