జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు లాక్, అధికారుల్లో టెన్షన్

First Published May 19, 2017, 2:55 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లా యాత్రకు వెళ్తున్న  ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి  హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో విశాఖఎయిర్ పోర్ట్ కు చేరుకుంటున్నారు.  ఆయన కోసం బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటుచేశారు. ఆయన విమానం దిగేలోపే కార్ లాకయిన విషయం అధికారులు కనుక్కున్నారు.  తాళాలను సిబ్బంది కారులోనే మర్చిపోయి, డోర్ వేశారు. దీనితో లాక్ పడింది.  లాక్ ఎంతకూ తెర్చుకోలేదు. దీనితో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.

జగన్  కోసం ఏర్పాటుచేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు లాక్ పడింది.  ఎలా తెరవాలో తెలియక అధికారులు పార్టీ నేతలు తీవ్ర  ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన ఈ ఉదయం విశాఖ ఎయిర్ పోర్ట్ జరిగింది.

శ్రీకాకుళం జిల్లా యాత్రకు వెళ్తున్న  ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి  హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో విశాఖఎయిర్ పోర్ట్ కు చేరుకుంటున్నారు.  ఆయన కోసం బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటుచేశారు. ఆయన విమానం దిగేలోపే కార్ లాకయిన విషయం అధికారులు కనుక్కున్నారు.  తాళాలను సిబ్బంది కారులోనే మర్చిపోయి, డోర్ వేశారు. దీనితో లాక్ పడింది.  లాక్ ఎంతకూ తెర్చుకోలేదు. దీనితో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.

వైసిపి నాయకుల్లో కూడా అందోళన మొదలయింది.

పర్యటన హడావిడిలో ఉన్న జగన్ కోసం మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటుచేయాలని  శ్రీకాకుళం ఎస్పీకి  సమాచారం పంపించారు. అక్కడి నుంచి వాహనం రావడానికికనీసం గంటన్నర పడుతుంది. అంతవరకు జగన్ ని ఎయిర్ పోర్ట్ లో ఆపడం ఎలా, అంది అంతమంచిది కూడా కాదు.

పరిస్థితినివైజాగ్ పోలీసు కమిషనర్ కు కూడా వివరించారు. జగన్ వచ్చేసరికి వాహనం సిద్ధం కాకపోతే ఎలా అని అందరిలో టెన్షన్

.ప్రోటోకోల్ అధికారుల పరిస్థితి చెప్పనసరం లేదు. ఇక లాభం లేదనుకుని, ప్రత్యామ్నాయ వాహనం ఏర్పాటుచేసుకోవడమే మంచిదని వైసిపి నేతలు భావిస్తున్నపుడు వైజాగ్ కమిషనర్ నుంచి ప్రత్యామ్నాయ వాహనం గురించిన సమాచారం  వచ్చింది. అంతా వూపిరి పీల్చుకున్నారు.

click me!