సొంత జిల్లాలోనే జగన్ షాక్... చంద్రబాబుతో వైసిపి కీలక నేత భేటీ

By Arun Kumar PFirst Published Aug 11, 2021, 9:25 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేందుకు సిద్దమయ్యారు కడప జిల్లాకు చెందిన వైసిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. 

కడప: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాకు చెందిన కీలక నేత షాకిచ్చేందుకు సిద్దమయ్యారు. రాయచోటి వైసిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో విజయవాడలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాంప్రసాద్ టిడిపిలో చేరికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ రావడంతో ఆయన అతి త్వరలో టిడిపి తీర్థం పుచ్చుకోడానికి సంసిద్దమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  

ఇక ఈ భేటీలో కడప జిల్లాతో పాటు రాయచోటి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల గురించి రాంప్రసాద్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. జిల్లాలో టిడిపి పరిస్థితి, కార్యకర్తల స్థితిగతులపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. రాయచోటి నియోజకవర్గంలో టిడిపి బలోపేతం కోసం అందరిని కలుపుకుపోతూ శక్తివంచనలేకుండా కృషి చేస్తానని చంద్రబాబుకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

read more  దాన్ని జగన్ కాదు ఆయన తాత రాజారెడ్డి కూడా అడ్డుకోలేడు: టిడిపి అనిత సంచలనం

గతంలోనూ పలుమార్లు రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. రెండు నెలల క్రితం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో భేటీ అయి పార్టీలో చేరికపై, రాయచోటిలో రాజకీయ పరిస్థితులు చర్చించారు. అప్పుడే రాంప్రసాద్ రెడ్డి టిడిపిలో చేరడం దాదాపు ఖాయమయ్యిందన్న ప్రచారం జరిగింది. 

ఇక అంతకుముందు కూడా చంద్రబాబు  శ్రీకాళహస్తి పర్యటనలో వుండగా రాంప్రసాద్ రెడ్డి కలిసారు. ఈ సమయంలోనూ వీరిద్దరి మధ్య పార్టీ చేరికపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇలా పలుమార్టు చంద్రబాబుతో భేటీ అనంతరం వైసిపిని వీడి టిడిపిలో చేరేందుకు రాంప్రసాద్ రెడ్డి సిద్దమయ్యారు. 

 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యంలోని జైసమైక్యంధ్ర పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన తర్వాత వైసిపిలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీ తరఫున రాయచోటి ఎమ్మెల్యే స్థానం ఆశించి భంగపడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదయినా కార్పోరేషన్ పదవి లేదా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించాడు. ఆ సంకేతాలు కనిపించకపోవడంతో టిడిపిలో చేరేందుకు సిద్దపడినట్లు తెలుస్తోంది.  
 

click me!