కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారు: బోయిన్‌పల్లి పోలీసులపై భూమా అఖిలప్రియ ఫిర్యాదు

By narsimha lodeFirst Published Aug 11, 2021, 9:21 AM IST
Highlights


బోయిన్‌పల్లి పోలీసులపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో కీలకమైన డాక్యుమెంట్లను బోయిన్‌పల్లి పోలీసులు తీసుకెళ్లారని సీసీటీవీ పుటేజీతో పాటు, ఫోటోలను కూడ ఫిర్యాదుకు ఆమె జత చేశారు.

హైదరాబాద్: బోయిన్‌పల్లి పోలీసులపై  కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ లో ఏపీకి చెందిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.హైద్రాబాద్ బోయిన్‌పల్లిలో కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్‌విఖ్యాత్ రెడ్డిలపైకేసు నమోదైంది.. ఈ కేసులో ఈ ముగ్గురు బెయిల్ పై విడుదలయ్యారు.

also read:భూమా అఖిలప్రియకు షాక్: భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిలపై మరో కేసు

ఈ కేసులో జైలులో టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ కి రావాల్సిందిగా భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలకు పోలీసులు ఆదేశాలిచ్చారు. అయితే  కరోనా వచ్చిందని  కరోనా రిపోర్టులను పంపారు. అయితే  ఈ రిపోర్టులు నకిలీలవని పోలీసులు తేల్చారు. ఈ నకిలీ రిపోర్టుల కేసులో భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలను అరెస్ట్ చేసేందుకు ఈ ఏడాది జూన్ మాసంలో బోయిన్‌పల్లి పోలీసులు అఖిలప్రియ ఇంటికి వచ్చారు.

ఈ సమయంలో భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఇంట్లో లేరు. తాము ఇంట్లో లేని సమయంలో బోయిన్‌పల్లి పోలీసులు తమ ఇంట్లోని పలు కీలకమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని అఖిలప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమ ఇంటిలోని సీసీటీవీ పుటేజీతో పాటు పోటోలను కూకట్‌పల్లి పోలీసులకు అందించారు.
 

click me!