అమరావతికి మారీచుడు సీఎం జగనే, ఆయనతోనే ప్రజలంతా యుద్ధం చేయాలనుకుంటున్నారు... రఘురామ

By SumaBala BukkaFirst Published Apr 5, 2023, 6:44 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో నిజమైన మారీచుడు వైఎస్ జగనే అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రిమీద విమర్శలు గుప్పించారు. 
 

ఢిల్లీ : వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైయస్ జగన్ మీద మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ తాను మారీచులతో యుద్ధం చేస్తున్నానని అంటున్నారు కానీ.. అసలైన మారీచూడు సీఎం జగన్ అని అన్నారు. అమరావతి మహా యజ్ఞంలో సీఎం జగనే మారీచూడు అని.. అందుకే అతనికి మిగతా వారంతా మారుచుల్లాగే కనిపిస్తారని..  విమర్శించారు. అసలైన మారీచూడైన సీఎం జగన్ తోనే ప్రజలంతా యుద్ధం చేయాలని అనుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు.

ప్రజలు హైకోర్టును అపార్థం చేసుకోవద్దని.. మారీచుని మాటలను నమ్మొద్దని  విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీ మీద దాఖలైన పిటీషన్ను కొట్టేస్తే బాగుండేదని అన్నారు. అలా చేయకుండా వాయిదా వేయడం వల్ల దీనికి సుప్రీంకోర్టులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాదు సుప్రీంకోర్టులో అమరావతిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మీద వెంటనే పిటిషన్ దాఖలు చేద్దామని ఆయన సూచించారు. 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా ఎజెండా: జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్.. పొత్తులపై వ్యాఖ్య

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖే రాజధాని అని చెబుతున్నారు.  త్వరలో తాను అక్కడికే వెళ్తానని చెబుతున్నారు. కానీ రాష్ట్రంలోని నలుమూలల్లో ఉన్నవారికి మాత్రం అమరావతిలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని రఘురామా ప్రశ్నించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరు కాలేదు. ఇది ఒక ఎత్తైతే.. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవడం మహా లోటుగా ఉందని రఘురామ వ్యంగ్యంగా అన్నారు.

రఘురామకృష్ణం రాజు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును సీఐడీ ప్రశ్నించడం మీద కూడా వైసిపి మీద విమర్శలు  గుప్పించారు.  రామోజీరావు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత. ఆయనను సిఐడి పోలీసులు విచారిస్తున్న సమయంలోని ఒక ఫోటో బయటకు వచ్చింది.  రామోజీరావు బెడ్ మీద పడుకుని ఉన్న ఫోటోను సాక్షి మీడియాలో ప్రచరితం చేశారు. అయితే, ఆ ఫోటో ఎలా బయటికి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సిఐడి ఎస్పి అమిత్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. బయట వ్యక్తులు విచారణ ప్రదేశానికి వెళ్లారా? లేకపోతే సిఐడినే అధికారికంగా ఆ ఫోటోను విడుదల చేసిందా?  అని సూటిగా ప్రశ్నించారు

click me!