విశాఖ ఎయిర్‌పోర్టును రక్షణ శాఖకు అప్పగిస్తాం: విజయసాయిరెడ్డి

By narsimha lodeFirst Published Sep 5, 2021, 3:48 PM IST
Highlights

భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ది చేసిన తర్వాత   విశాఖపట్టణం ఎయిర్ పోర్టును రక్షణ శాఖకు అప్పగిస్తామని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఆదివారంనాడు విశాఖలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

విశాఖపట్టణం:భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ది చెందిన తర్వాత విశాఖపట్టణం ఎయిర్‌పోర్టును రక్షణశాఖకు కేటాయిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు.ఆదివారం నాడు ఆయన విశాఖపట్టణంో మీడియాతో మాట్లాడారు.విజయనగరం, విశాఖపట్టణాలను  జంట నగరాలుగా అభివృద్ది చెందుతాయన్నారు.  విశాఖపట్టణం నుండి భోగాపురం ఎయిర్‌పోర్టుకు కలుపుతూ రహదారి నిర్మాణం చేపడుతామని విజయసాయిరెడ్డి ప్రకటించారు.  

విశాఖ-భోగాపురం ఎయిర్ పోర్టు రోడ్డు అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన గుర్తు చేశారు. విశాఖను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని  విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్టణంలో మురికివాడలను అభివృద్ది చేసి పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.

2020 మే మాసంలో విజయనగరంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు అబివృద్ది పనులకు సంబంధించి పీపీపీ విధానంలో జీఎంఆర్ కు ఏపీ ప్రభుత్వం అప్పగించింది.ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే 2,200 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మరో 500 ఎకరాల భూమిని ప్రభుత్వం తన ఆధీనంలోనే ఉంచుకొంటుంది. 

click me!