Pushpa బెనిఫిట్ షో : డబ్బులు వసూలు, హిందూపురం బాలాజీ థియేటర్ వద్ద ఉద్రిక్తత

Published : Dec 17, 2021, 09:30 AM ISTUpdated : Dec 17, 2021, 09:37 AM IST
Pushpa బెనిఫిట్ షో : డబ్బులు వసూలు,  హిందూపురం బాలాజీ థియేటర్ వద్ద ఉద్రిక్తత

సారాంశం

అనంతపురం జిల్లా హిందూపురంలోని బాలాజీ థియేటర్ వద్ద  శుక్రవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. పుష్ప సినిమా బెనిఫిట్ షో వేస్తామని  డబ్బులు వసూలు చేసి బాలాజీ థియేటర్ యాజమాన్యం మోసం చేశారని బన్నీ అభిమానులు ఆందోళనకు దిగారు.

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం వద్ద బాలాజీ థియేటర్ వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్తత చోటు చేసకొంది. Pushpa  సినిమా బెనిఫిట్ సో వేస్తామని చెప్పి Balaji థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసి షో వేయలేదని అభిమానులు ఆందోళనకు దిగారు.బాలాజీ థియేటర్ యాజమాన్యం benefit show  షో వేస్తామని చెప్పి ఒక్కొక్కరి నుండి రూ. 500 వసూలు చేసిందని అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు.అయితే  ఇవాళ ఉదయం సినిమా థియేటర్ వద్దకు వెళ్లిన అభిమానులకు నిరాశే మిగిలింది.  బెనిఫిట్ షో వేయలేదు.  దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ పై రాళ్లు రువ్వారు.ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. బన్నీ అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. థియేటర్ గేట్లు మూసివేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో బెనిఫిట్ షో లు వేయవద్దని ఇటీవలనే 35 నెంబర్ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది.

also read:Pushpa movie review: పుష్ప ట్విట్టర్ టాక్.. పోకిరి రేంజ్ క్లైమాక్స్ ట్విస్ట్!

అయితే రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, ఇష్టారీతిలో టికెట్ ధరల పెంపు విషయమై ఏపీ ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ మేరకు 35 నెంబర్ జీవోను జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ కొందరు థియేటర్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. అయితే 35 నెంబర్ జీవోను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు రద్దు చేసింది. అయితే ఈ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే జాయింట్ కలెక్టర్లు టికెట్ల ధరలను నిర్ణయించాలని హైకోర్టు డివిజన్ చెంచ్ గురువారం నాడు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గురువారం నాడు సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించిన జీవో నెం.35 అమల్లోనే ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. జీవో 35పై హైకోర్టు తీర్పు పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని హోంశాఖ సెక్రటరీ  తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీలో ఈ విషయంగా స్పష్టంగా పేర్కొన్నారని ఆయన వివరించారు.

టికెట్ల రేట్ల జీవో నెం.35పై హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు కాగా, 3 పిటిషన్లకు కలిపి ఒకేసారి విచారణ, తీర్పు ఇచ్చినట్టు హోంశాఖ సెక్రటరీ పేర్కొన్నారు. తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో 1 థియేటర్ కు పాత పద్ధతిలోనే టికెట్ల విక్రయాలకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు కూడా హైకోర్టు తీర్పు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ థియేటర్లకు మాత్రమే హైకోర్టు జీవో నెం.35ని సస్పెండ్ చేసిందని హోంశాఖ ముఖ్యకార్యదర్శి వివరణ ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్