జైలు గదిలో శివుడినంటూ పద్మజ కేకలు: దంపతులను తిరుపతి స్విమ్స్ కి తరలించే ఛాన్స్

Published : Jan 27, 2021, 12:41 PM ISTUpdated : Jan 27, 2021, 05:45 PM IST
జైలు గదిలో శివుడినంటూ  పద్మజ కేకలు: దంపతులను తిరుపతి స్విమ్స్ కి తరలించే ఛాన్స్

సారాంశం

మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన పురుషోత్తంనాయుడు, ఆయన భార్య పద్మజల మానసిక స్థితి సరిగా లేనందున తిరుపతి స్విమ్స్ కు తరలించాలని జైలు అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు  మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోనున్నారు.

చిత్తూరు: మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన పురుషోత్తంనాయుడు, ఆయన భార్య పద్మజల మానసిక స్థితి సరిగా లేనందున తిరుపతి స్విమ్స్ కు తరలించాలని జైలు అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు  మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోనున్నారు.

also read:మదనపల్లిలో కూతుళ్ల హత్యలో ట్విస్ట్, పద్మజకు మానసిక సమస్యలు: డాక్టర్ రాధిక

మేజిస్ట్రేట్ ఆదేశం మేరకు మదనపల్లి సబ్ జైలుకు మంగళవారంనాడు సాయంత్రం దంపతులను తరలించారు. మంగళవారం నాడు రాత్రి పూట పద్మజ తానే శివుడినని కేకలు వేసింది.ఈ కేకలతో పద్మజతో పాటు జైలులో ఉన్న ఖైదీలు భయానికి లోనయ్యారు.

ఈ విషయమై జైలు అధికారులు స్థానిక పోలీసులకు కూడ సమాచారం ఇచ్చారు. పద్మజతో పాటు పురుషోత్తంనాయుడుల మానసిక పరిస్థితి సరిగా లేనందున  చికిత్స చేయించాని జైలు అధికారులు బావించారు. 

ఈ మేరకు మేజిస్ట్రేట్ కు సబ్ జైలర్ రామకృష్ణనాయక్  లేఖ రాశారు. జైలు నుండి ఆసుపత్రికి దంపతులను తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.మరో వైపు వీరిద్దరిని ఆసుపత్రికి తరలించేందుకు గాను అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని మదనపల్లి డీఎస్పీకి సబ్ జైలర్  కోరారు.పోలీస్ బందోబస్తుతో ఈ దంపతులను జైలు అధికారులు  తిరుపతి స్విమ్స్ కు తరలించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్