ట్రైన్ కిందపడి పచ్చడైన బైక్.. సెకన్లో తప్పించుకున్నాడు... (వీడియో)

Bukka Sumabala   | Asianet News
Published : Jan 27, 2021, 12:16 PM ISTUpdated : Jan 27, 2021, 12:18 PM IST
ట్రైన్ కిందపడి పచ్చడైన బైక్.. సెకన్లో తప్పించుకున్నాడు... (వీడియో)

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ట్రైన్ ఢీ కొట్టి టూవీలర్ తునాతునకలయ్యింది. రాజమండ్రి తాడితోట రైల్వే గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఓ బైక్ ముక్కలు ముక్కలయ్యింది.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ట్రైన్ ఢీ కొట్టి టూవీలర్ తునాతునకలయ్యింది. రాజమండ్రి తాడితోట రైల్వే గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఓ బైక్ ముక్కలు ముక్కలయ్యింది.

"

రాజమండ్రిలో తాడితోట ప్రాంతం నుంచి రంభ, ఊర్వశి  థియేటర్లకు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేట్ వద్ద రైలు వస్తుండడంతో గేట్లు వేశారు. అయితే దాన్ని పట్టించుకోకుండా టూ వీలర్ మీద ఓ యువకుడు ట్రాక్ దాటే ప్రయత్నం చేశాడు.

చివరి నిముషంలో ట్రైన్ వస్తుండడం గమనించి బైక్ మీదినుంచి దిగిపోయాడు. బైక్ పట్టాకు దగ్గరగా ఉంది. ఇంతలో స్పీడ్ గా వచ్చిన ట్రైన్ మొదట బైక్ ను పక్కకు తోసింది. ఆ తరువాత ట్రైన్ స్పీడ్ కు బైక్ తునాతునకలయ్యింది. 

అయితే ఈ ప్రమాదంలో యువకుడు సెకనులో తప్పించుకున్నాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. 
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?