చంద్రబాబుతో నేడు సూపర్ స్టార్ సోదరుడు భేటీ

By Nagaraju TFirst Published Jan 24, 2019, 7:13 AM IST
Highlights

అసలు కారణం మాత్రం ప్రస్తుతం గుంటూరు ఎంపీ టిక్కెట్ అని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున గుంటూరు పార్లమెంట్  నుంచి పోటీ చెయ్యాలని ఆదిశేషగిరిరావు భావించారు. అయితే అందుకు జగన్ ససేమిరా అన్నారని దీంతో ఆయన పార్టీ మారుతున్నారు. 

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు గురువారం భేటీకానున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 7 లేదా 8న టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం. 

అయితే అంతకుముందే చంద్రబాబుతో భేటీ కావాలని ఆదిశేషగిరిరావు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరే అంశంపై చర్చించేందుకు చంద్రబాబుతో భేటీ అవుతున్నారా లేక గురువారమే సైకిల్ ఎక్కాలని నిర్ణయించుకున్నారా అన్న సందేహం నెలకొంది. 

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆదిశేషగిరిరావు జనవరి 8న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల పార్టీలో ఇమడలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

అసలు కారణం మాత్రం ప్రస్తుతం గుంటూరు ఎంపీ టిక్కెట్ అని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున గుంటూరు పార్లమెంట్  నుంచి పోటీ చెయ్యాలని ఆదిశేషగిరిరావు భావించారు. అయితే అందుకు జగన్ ససేమిరా అన్నారని దీంతో ఆయన పార్టీ మారుతున్నారు. 

కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీ తరపున గుంటూరు ఎంపీగా పనిచేస్తున్నారు. ఇకపోతే ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో జరిగిన అనుభవాల దృష్ట్యా వైఎస్ జగన్ అభ్య‌ర్ధుల ఎంపిక‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే గుంటూరు నుండి ఎంపీగా పోటీ చేయాల‌ని భావిస్తున్న ఆదిశేష‌గిరిరావుకి నో చెప్పారట జగన్. విజ‌య‌వాడ నుండి పోటీ చేయాల‌ని జ‌గ‌న్ సూచించార‌ట‌. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి విజ్ఞాన్ సంస్థ‌ల అధినేత కుమారుడిని బరిలో దించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. 

దీంతో అసంతృప్తి చెందిన అదిశేష‌గిరిరావు పార్టీకి రాజీనామా చేశారు. ఇకపోతే గతంలో సూపర్ స్టార్ కృష్ణ, ఆదిశేషగిరిరావులు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు.  

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీలోకి ఆదిశేషగిరిరావు చేరే ముహుర్తమిదే!

జగన్ కు షాక్: పార్టీకి ఆదిశేషగిరి రావు రాజీనామా

click me!
Last Updated Jan 24, 2019, 7:13 AM IST
click me!