గుంటూరులో ఓ ప్రైవైట్ స్కూల్ టీచర్ విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించాడు. హోంవర్క్ చేయలేదని మోకాళ్ల మీద కూర్చోబెట్టాడు. ఇది తల్లిదండ్రులకు తెలిసి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
గుంటూరు : homework చేయలేదని బాపట్లలో ఒక private school teacher విద్యార్థులని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు. అంతటితో ఆగకుండా పిల్లలు హోంవర్క్ చేయలేదంటూ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఫోటో తీసి మరీ పేరెంట్స్ కి పంపించాడు. దీంతో సదరు టీచర్ పై పేరెంట్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్ ను స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేశారు.
గతంలో పిల్లలు చదవాలని, వారు రెగ్యులర్ గా స్కూలుకు రావాలని టీచర్లు కఠినమైన శిక్షలు వేసేవారు. కోదండం ఎక్కించడం, కాళ్లకు మొద్దులు కట్టడం, ఆలస్యంగా వస్తే గుంజీలు తీయించడం, గోడకుర్చీ వేయించడం.. అత్యంత మామూలు విషయాలుగా ఉండేవి. కానీ కాలం మారింది. విద్యావ్యవస్థలో, టీచర్లలో, విద్యార్థుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో పిల్లలను దండించడం నేరం. ప్రస్తుతమున్న విధానాల ప్రకారం.. విద్యార్థులను ఏ విధంగానూ దండించకుండా పాఠాలు బోధించాలి. ఈ క్రమంలో జరిగిందే ఈ ఘటన..
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 8న tamilnaduలో ఓ గవర్నమెంట్ టీచర్ చేసిన పని సంచలనంగా మారింది. ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలవడం ఉండాలని video తీసి వైరల్ చేసిన ఘటన పెను దుమారం రేపింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ఘటన కావడంతో స్వయంగా తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.
మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంది సదరు టీచర్ (42). ఈ క్రమంలో ఓ రోజు ముగ్గురు విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని వారితో శారీరకంగా కలిసింది. ఈ తతంగాన్ని 39 ఏళ్ల వయసున్న ఆమె ప్రియుడు, స్థానిక వ్యాపారవేత్త అయిన ఒకరు వీడియో తీశాడు. ఆపై ఆ వీడియోను తన స్నేహితుల సహాయంతో వాట్స్అప్ ద్వారా సర్క్యులేట్ చేశాడు.
వీడియో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో తమిళనాడు డిజిపి కార్యాలయం స్పందించింది. తక్షణమే ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై టీచర్, ఆమె ప్రియుడిని మదురై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ 2010 నుంచి సదరు వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోంది. కేవలం వైరల్ కావడం కోసమే ఆ వీడియో తీశారా? లేదంటే అశ్లీల సైట్లో అప్లోడ్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? బ్లాక్ మెయిలింగ్ కోణం ఉందా? అనేది సైబర్ విభాగం తేల్చాల్సి ఉంది. వీడియోను ఎవరికి పంపారు? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.మరోవైపు ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు సదరు టీచర్ పై ఆమె ప్రియుడిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనితో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.