
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్దమైంది. డీజిల్ ధరల పెరగుదలతో ఛార్జీలు పెంచాలని APSRTC నిర్ణయం తీసుకుంది. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై నెలకు రూ. వెయ్యి కోట్ల భారం పడుతుందని.. భారాన్ని తగ్గించుకోవడం చార్జీల పెంచడమే మార్గమని ఆర్టీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనను సిద్దం చేసిన ఆర్టీసీ అధికారులు.. వాటిని ఆమోదం కోసం వారం క్రితమే సీఎం జగన్ వద్దకు పంపినట్టుగా తెలుస్తోంది.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో బస్సు చార్జీల పెంపుపై వారు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక, చివరగా 2019 డిసెంబర్‌లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది.