మంత్రి జోగి రమేష్ ర్యాలీలో అపశృతి.. సర్పంచ్ మృతి..

Published : Apr 13, 2022, 01:32 PM IST
మంత్రి జోగి రమేష్ ర్యాలీలో అపశృతి.. సర్పంచ్ మృతి..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన ర్యాలిలో అపశృతి చోటుచేసుకుంది. గుండెపోటుతో ఓ సర్పంచ్ మృత్యువాతపడ్డాడు. 

కృష్ణా జిల్లా : రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి Jogi Ramesh ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం minister గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా ఆయన మంగళవారం సొంత నియోజకవర్గమైన కృష్ణా జిల్లా పెడనకు వచ్చారు. మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారిమీద గూడురు మండలం తరకటూరు వద్ద జోగి రమేష్ కు స్వాగతం పలికిన కోకనారాయణపాలెం సర్పంచి బండి రమేష్ (45) ర్యాలీని అనుసరిస్తున్నారు. ఇంతలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో గమనించిన అనుచరులు వెంటనే ఆయనను మచిలీపట్నం తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. పెడనలోని క్యాంపు కార్యాలయంలో సర్పంచి చిత్రపటం వద్ద మంత్రి నివాళులర్పించారు. అనంతరం కోకనారాయణపాలెం వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అండగా ఉంటామని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. 

ఇదిలా ఉండగా, సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జోగి రమేష్ ప్రమాణం చేశారు. .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది.  సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు  వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామా చేస్తానని ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనను బుజ్జగించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu