కారణమిదీ: కుప్పం సమీపంలో హెలికాప్టర్ ఎమర్జన్సీ ల్యాండింగ్

By narsimha lodeFirst Published Oct 18, 2020, 12:01 PM IST
Highlights

చిత్తూరు జిల్లాలోని కుప్పం సమీపంలోని తిరుపత్తూరు వద్ద ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ఆదివారం నాడు అత్యవసరంగా ల్యాండ్ అయింది.
 

కుప్పం: చిత్తూరు జిల్లాలోని కుప్పం సమీపంలోని తిరుపత్తూరు వద్ద ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ఆదివారం నాడు అత్యవసరంగా ల్యాండ్ అయింది.

వాతావరణం సరిగా  లేకపోవడంతో పైలెట్ హైలికాప్టర్ ను అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేశాడు. హెలికాప్టర్ పొలాల్లో ల్యాండ్ కావడంతో  స్థానికులు పెద్ద ఎత్తున  హెలికాప్టర్ ను చూసేందుకు వచ్చారు.

తమిళనాడులోని కోయంబత్తూరు నుండి తిరుపతికి ప్రైవేట్ హెలికాప్టర్ లో వస్తున్న సమయంలో అత్యవసరంగా పొలాల్లో హెలికాప్టర్ ను ల్యాండ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని పైలెట్ చెప్పారు.

పొగ మంచు కారణంగా హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించలేదు.. దీంతో తిరుపత్తూరు సమీపంలోనే హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. ఈ హెలికాప్టర్ లో ఇద్దరు పైలెట్లతో పాటు ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. 

వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హెలికాప్టర్లు అత్యవసరంగా ల్యాండ్ అయిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ఇవాళ కుప్పం సమీపంలోని తిరుపత్తూరు వద్ద  పైలెట్ హెలికాప్టర్ ను అత్యంత చాకచక్యంగా పొలాల్లో దింపాడు. వాతావరణం అనుకూలించిన తర్వాత తిరిగి హెలికాప్టర్ ప్రయాణించే అవకాశం ఉంది. 

 

click me!