విజయవాడ వద్ద బస్సులో నుండి దూకిన ప్రయాణీకులు: ఏమైందంటే?

Published : Oct 18, 2020, 10:48 AM ISTUpdated : Oct 18, 2020, 10:49 AM IST
విజయవాడ వద్ద  బస్సులో  నుండి దూకిన ప్రయాణీకులు: ఏమైందంటే?

సారాంశం

బస్సులో జరిగిన అగ్ని ప్రమాదం నుండి ప్రయాణీకులు సురక్షితంగా తప్పించుకొన్నారు.విజయవాడకు సమీపంలోని ప్రసాదంపాడు వద్ద జాతీయరహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం నాడు రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. 


విజయవాడ:బస్సులో జరిగిన అగ్ని ప్రమాదం నుండి ప్రయాణీకులు సురక్షితంగా తప్పించుకొన్నారు.విజయవాడకు సమీపంలోని ప్రసాదంపాడు వద్ద జాతీయరహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం నాడు రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదాన్ని గమనించిన ప్రయాణీకులు బస్సు కిటీకీల నుండి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకొన్నారు.

శ్రీకాకుళం నుండి విజయవాడకు వస్తున్న ప్రైవేట్ బస్సు ప్రసాదంపాడు సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణీకులను బస్సు నుండి  దించేశారు.

బస్సు టైర్ పగలింది. దీంతో బస్సు వెనుక భాగంలో మంటలు అంటుకొన్నట్టుగా బస్సు డ్రైవర్ చెప్పారు.  కొందరు ప్రయాణీకులు కిటీకీ నుండి కిందకు దూకారు. ఈ విషయం తెలిసిన వెంటనే  అగ్నిమాపక సిబ్బంది బస్సువద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. 

ఈ ఘటనతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. బస్సును రోడ్డుపై నుండి పక్కకు జరిపి ట్రాఫిక్ ను  క్లియర్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!