తెలుగు రాష్ట్రాల్లో కలకలం: బోర్డు తిప్పేసిన ప్రైవేట్ బ్యాంక్

By Siva Kodati  |  First Published Mar 12, 2021, 9:31 PM IST

కృష్ణా జిల్లా నూజివీడులో ప్రైవేట్ బ్యాంక్ బోర్డు తిప్పేసింది. "అమరావతి క్యాపిటల్ మ్యూచివల్ మల్టిపర్పస్ సొసైటీ" లిమిటెడ్ పేరుతో విజయవాడ ,తిరువూరు, విసన్నపేట, నూజివీడులో బ్రాంచిలు పెట్టింది


కృష్ణా జిల్లా నూజివీడులో ప్రైవేట్ బ్యాంక్ బోర్డు తిప్పేసింది. "అమరావతి క్యాపిటల్ మ్యూచివల్ మల్టిపర్పస్ సొసైటీ" లిమిటెడ్ పేరుతో విజయవాడ ,తిరువూరు, విసన్నపేట, నూజివీడులో బ్రాంచిలు పెట్టింది.

అయితే గడువు తీరినప్పటికీ ఖాతాదారుల సొమ్ము చెల్లించటలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నూజివీడు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఒక్క నూజివీడు బ్రాంచ్‌లో 50 లక్షల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Latest Videos

undefined

 

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరువూరులో సుమారు రూ.5 లక్షల మోసం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై నూజీవీడు పోలీసులు మాట్లాడుతూ... ఖాతాదారులకు సొమ్ము ఎగవేసిన కేసులో అమరావతి బ్యాంకుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

 

 

ఖాతాదారులు వారి నగదు డిపాజిట్ చేసి, గడువు తీరగా తిరిగి చెల్లించమని ఎన్నిసార్లు కోరినప్పటికీ అనేక వాయిదాలు వేస్తూ తమ సొమ్ము ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. నూజివీడులోని అమరావతి బ్యాంకులో మొత్తం 34 మంది ఖాతాదారులు ఉన్నాయని పోలీసులు చెప్పారు,

ఫిర్యాదు చేసిన ఖాతాదారులకు సంబంధించి సుమారు 17 లక్షల రూపాయల వరకు బ్యాంకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ప్రజలు బోర్డులు తిప్పే ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఎవరు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

click me!