రామకృష్ణారెడ్డి అరెస్ట్‌: కక్షసాధింపేనన్న చంద్రబాబు, వైసీపీపై ఆగ్రహం

By Siva KodatiFirst Published Mar 12, 2021, 8:55 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌ను ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. సంబంధం లేని అంశంలో ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ చీఫ్ ఆరోపించారు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌ను ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. సంబంధం లేని అంశంలో ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ చీఫ్ ఆరోపించారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనమవుతోందని చంద్రబాబు  మండిపడ్డారు. టీడీపీ నేతలపై ఇవి ముమ్మాటికీ కక్షసాధింపు చర్యలేనని.. వైసీపీ తన వికృత రాజకీయాలతో ప్రజలను భయపెడుతోందని ప్రతిపక్షనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించిన వారిపై కక్షసాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేసి ఆయనను విడుదల చేయాలని టీడీపీ అధినేత డిమాండ్‌ చేశారు.

Also Read:బావ హత్య కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అరెస్టు

అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని తెలుసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. కాగా, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆయన అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.  

click me!