మళ్లీ 200 దాటిన కేసులు.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో కరోనా డేంజర్ బెల్స్

By Siva Kodati  |  First Published Mar 12, 2021, 7:08 PM IST

ఓ వైపు దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో మహమ్మారి కోరలు చాస్తుండటంతో నాగపూర్‌లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా.. ఈరోజు నుంచి పుణే సహా మరో రెండు జిల్లాల్లోనూ లాక్‌‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించింది.


ఓ వైపు దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో మహమ్మారి కోరలు చాస్తుండటంతో నాగపూర్‌లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా.. ఈరోజు నుంచి పుణే సహా మరో రెండు జిల్లాల్లోనూ లాక్‌‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించింది.

దక్షిణాదిలో కేరళలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలోనూ పరిస్ధితి అదుపు తప్పుతున్నట్లుగా వుంది. కొన్ని నెలల తర్వాత తొలిసారి 200కు పైగా కేసులు నమోదయ్యాయి.

Latest Videos

undefined

గడిచిన 24 గంటల్లో కొత్తగా 210 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,91,388కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీనితో కలిపి ఏపీలో వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,180కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 140 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,82,981కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,227 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న రాష్ట్రంలో 44,709 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా నిర్థారణా పరీక్షల సంఖ్య 1,44,48,650కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 12, చిత్తూరు 85, తూర్పుగోదావరి 41, గుంటూరు 18, కడప 3, కృష్ణా 14, కర్నూలు 4, నెల్లూరు 3, ప్రకాశం 3, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 16, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

 

: 12/03/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,88,493 పాజిటివ్ కేసు లకు గాను
*8,80,086 మంది డిశ్చార్జ్ కాగా
*7,180 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,227 pic.twitter.com/P5f6neJExS

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!