
అనంతపురం: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారంనాడు మధ్యాహ్నం పుట్టపర్తి విమానశ్రాయానికి చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయం నుండి మోడీ లేపాక్షి ఆలయానికి బయలుదేరారు . లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రంగనాథ ఆలయంలోని శ్లోకాలను మోడీ తెలుగులో విన్నారు..అయోధ్యలోని రామాలయం ప్రాణ ప్రతిష్టకు ఆరు రోజుల ముందే రామాయణంలోని లేపాక్షి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో తోలుబొమ్మలాటను మోడీ తిలకించారు. శ్రీరాముడి జీవిత చరిత్రపై ప్రదర్శించిన తోలుబొమ్మలాటను మోడీ ఆసక్తిగా చూశారు.లేపాక్షి ఆలయం శిల్పకళా సంపదను పరిశీలించారు. లేపాక్షి స్థల పురాణం గురించి తెలుసుకున్నారు. లేపాక్షి గుడిలోని వేలాడే స్థంభం గురించి మోడీకి అధికారులు వివరించారు.
సీతమ్మను రావణుడు అపహరించే సమయంలో జటాయువు రావణుడిని అడ్డగించే ప్రయత్నం చేసింది. రావణుడి చేతిలో గాయపడిన జటాయువు పడిన ప్రదేశమే లేపాక్షిగా పురాణాలు చెబుతాయి.నాసిక్ లోని కాలా రామమందిరాన్ని దర్శించుకున్న తర్వాత లేపాక్షి ఆలయానికి మోడీ వచ్చారు.
ఆసియా ఖండంలోని రూ. 541 కోట్లతో నాసిన్ ను గోరంట్ల మండలం పాలసముద్రంలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని మోడీ ప్రారంభిస్తారు. పుట్టపర్తి విమానాశ్రయంలో మోడీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సహా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.2015లో నాసిన్ కు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట ప్రయాణం చేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. ఐఎఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులుగా ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు.