మన్ కీ బాత్ : నరేంద్రమోదీ ప్రశంసలు పొందిన నంద్యాల కవయిత్రి.. కవితాపంక్తులు చదివి ప్రధాని కితాబు..

Published : Feb 27, 2023, 09:15 AM IST
మన్ కీ బాత్ : నరేంద్రమోదీ ప్రశంసలు పొందిన నంద్యాల కవయిత్రి.. కవితాపంక్తులు చదివి ప్రధాని కితాబు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మహిళా రచయితకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కితాబు దక్కింది. ఆమె రాసిన ఓ కవితా పంక్తులను ప్రధాని తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. 

ఢిల్లీ :  నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన ఓ రచయిత్రికి అరుదైన గౌరవం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో ఆమె కవితను ప్రస్తావించారు. ఈ అపురూపమైన గుర్తింపును దక్కించుకున్న రచయిత్రి పేరు తాటిచెర్ల విజయదుర్గ.  నంద్యాల జిల్లా కోవెలకుంట్ల నివాసి. ప్రతిఏటా సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జరిపే ఐక్యత దినోత్సవం రోజున దేశభక్తి గీతాలు, ముగ్గుల పోటీలు, లాలి పాటల పోటీలు నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీల గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు.  ఈ సందర్భంగానే ఆయన విజయదుర్గ కవితను గుర్తు చేశారు.

ప్రధాని మాట్లాడుతూ.. ‘ఐక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఏడువందలకు పైగా జిల్లాలనుంచి 26 భాషల్లో ఐదు లక్షల మందికిపైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. అయితే వీరందరిలోనూ ఒక ఛాంపియన్ ఉన్నారు. వీరంతా దేశ వైవిద్యం, దేశ సంస్కృతి మీద ఎనలేని ప్రేమను ప్రదర్శించారు. అని ప్రశంసించారు. ఈ పోటీల్లో ఫస్ట్ సెకండ్ ప్రైజులు పొందిన వారిని ప్రధాని మెచ్చుకున్నారు. మొదటి బహుమతి కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందిన బీఎం మంజునాథ్ కన్నడలో రాసిన లాలిపాటకు.. ద్వితీయ బహుమతి అస్సాంలోని కామరూపు జిల్లాకు చెందిన దినేష్ గోవాలా అసెంబ్లీలో రాసిన లాలి పాటకు వచ్చాయి. వీటిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నెల్లూరు తోడేరు చెరువులో పడవ బోల్తా.. ప్రమాదంలో, ఆరుగురు యువకుల గల్లంతు, నలుగురు సురక్షితం..

ఆ తర్వాత దేశభక్తి గీతాలు పోటీలో విజేతగా నిలిచిన కవయిత్రి,  గృహిణి విజయదుర్గ పేరును ప్రస్తావించారు. ఆమె  రాసిన కవితా పంక్తులను చదివారు. తన ప్రాంతంలోని మొదటి తరం స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నుంచి ఆమె ప్రేరణ పొందారని దానిని అభినందించారు. ఆమె  మైథిలీ భాషలో రాసిన దేశభక్తి కవితను ప్రస్తావించారు. పోటీలకు వచ్చిన అన్ని ఎంట్రీలను కేంద్ర సాంస్కృతిక శాఖ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది..

విజయదుర్గ రాసి కవిత ఇదే...

‘రేనాటి సూర్యుడా.. వీరనరసింహుడా..

భారత స్వాతంత్ర్య సమరపు అంకురానికి నీవురా.. 

అంకుశానికి నీవురా..

తెల్లదొరల నీతిలేని నిరంకుశపు దమనకాండకు..

సలసలమని మరిగిన నీ నెత్తుటి ఎర్రని కాకలు...

రేనాటి సూర్యుడా.. వీరనరసింహుడా.. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్