తండ్రిమీద కొడుకు విచక్షణారహిత దాడి.. ప్రియురాలికి వీడియో కాల్ లో లైవ్ చూపిస్తూ...

Published : Feb 27, 2023, 07:18 AM IST
తండ్రిమీద కొడుకు విచక్షణారహిత దాడి.. ప్రియురాలికి వీడియో కాల్ లో లైవ్ చూపిస్తూ...

సారాంశం

తన వివాహేతర సంబంధాన్ని ఎత్తి చూపాడని.. తండ్రిని విచక్షణారహితంగా కొట్టాడో కొడుకు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో చోటు చేసుకుంది. 

చిత్తూరు : ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరులో ఓ పాశవిక ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి కొడుకు కన్న తండ్రి మీద అతి దారుణంగా దాడి చేశాడు. ఆ సమయంలో ప్రియురాలికి వీడియో కాల్ చేసి తాను చేస్తున్న ఘనకార్యాన్ని మొత్తం లైవ్ లో చూపించాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చిత్తూరులో చోటుచేసుకుంది.  దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..  ఢిల్లీబాబు అనే వ్యక్తి హోంగార్డుగా పని చేస్తున్నాడు. చిత్తూరులో స్థానికంగా నివసిస్తున్నాడు, అతనికి ఓ కుమారుడు ఉన్నాడు. అతని పేరు భరత్ (21). మూటలు మోసే కూలీగా పని చేస్తున్నాడు. అతను వయసులో తనకంటే 18 ఏళ్లు పెద్దాయన ఓ మహిళ(39)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఆమె అదే నగరంలోని ఒక కాలనీలో ఉంటుంది. అయితే, ఈ విషయం తండ్రికి తెలిసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన తండ్రి అతడిని తీవ్రంగా మందలించాడు. ఆ తర్వాత ఈ విషయం గురించి చిత్తూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కొడుకు భరత్ ను స్టేషన్కు పిలిపించారు. భరత్ ను మందలించి పంపించారు. దీంతో భరత్ తీవ్ర అవమానంగా భావించాడు.  తండ్రి మీద పగ పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. 

జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప.. టీడీపీకి బతకదని వాళ్లకు అర్థమైంది: మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

తమ వివాహేతర సంబంధాన్ని తండ్రి ప్రశ్నించాడని, పోలీసులకు చెప్పి మందలించాడని… తండ్రి మీద తాను దాడి చేస్తానని చెప్పాడు. అలా చెబుతూనే తండ్రి దగ్గరికి వెళ్లి అతని తీవ్రంగా కొట్టాడు. తలపై కర్రతో బలంగా కొట్టడంతో ఢిల్లీ బాబుకు తీవ్ర రక్తస్రావం అయింది. అతనికి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఢిల్లీ బాబును.. ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటన మీద దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్