విశాఖలో గ్యాస్ లీకేజీ: జగన్‌కి మోడీ ఫోన్, పలువురి సంతాపం

Published : May 07, 2020, 11:23 AM ISTUpdated : May 07, 2020, 04:59 PM IST
విశాఖలో గ్యాస్ లీకేజీ: జగన్‌కి మోడీ ఫోన్, పలువురి సంతాపం

సారాంశం

విశాఖపట్టణం జిల్లాలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనపై  ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  చర్చించారు.   


అమరావతి: విశాఖపట్టణం జిల్లాలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనపై  ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  చర్చించారు. 

ఇవాళ ఉదయం మూడు గంటల సమయంలో ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ  నుండి గ్యాస్ లీకైంది. ఆరుగురు మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మోడీ స్పందించారు. గ్యాస్ లీకైన విషయంపై సీఎం జగన్ ప్రధాని మోడీకి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి వివరించారు. పరిస్థితి అదుపులోనే ఉందని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడ ఈ విషయమై స్పందించారు.. సహాయక చర్యల గురించి చర్చించారు. సంబంధిత అధికారులతో చర్చించినట్టుగా ఆయన వివరించారు. 

గవర్నర్‌  బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా సీఎంకు ఫోన్‌చేశారు. ప్రమాదకారణాలు సహా సహాయక చర్యలను సీఎం ఆయనకు వివరించారు.విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన పై ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమీక్ష  నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్‌ నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరయ్యారు. బాధితులకు అందించాల్సిన చర్యల గురించి సీఎం అధికారులను ఆదేశించారు.

also read:సైరన్ మోగలేదు:విశాఖలో స్టైరెన్ గ్యాస్ లీకేజీపై వెంకటాపురం వాసులు

విశాఖపట్టణంలో గ్యాస్ లీకైన ఘటనపై కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. బాధితులకు సహాయం అందించాలని రాహుల్ గాంధీ  పార్టీ నేతలు, కార్యకర్తలను ఆదేశించారు. ఈ ఘటన వినగానే తాను షాక్ కు గురైనట్టుగా ఆయన చెప్పారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. అస్వస్థతకు గురైన వారంతా త్వరగా కోలుకోవాలని రాహుల్ గాంధీ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

విశాఖలో గ్యాస్ లీకైన ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమైందిగా ఆయన అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే