వైజాగ్ ఎల్జీ పాలీమర్స్ నుంచి విడుదలైన విషయవాయువు ఇదీ: దాని వల్ల ప్రమాదాలు ఇవీ...

By Sree sFirst Published May 7, 2020, 11:05 AM IST
Highlights

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలై ప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. 

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలై ప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. 

ఇక ఈ గ్యాస్ వెలువడగానే అందరూ దీన్నేదో భోపాల్ గ్యాస్ దుర్ఘటనతో పోలుస్తున్నారు. ఈ గ్యాస్ బెంజీన్ కుటుంబానికి చెందిన ఒక గ్యాస్. దీని రసాయనిక నామం ఇథనైల్ బెంజీన్. దీన్ని మనం వాడుక భాషలో స్టైరిన్ లేదా వినైల్ బెంజీన్ అంటాము. 

ఈ స్టైరిన్ ని పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా పాలీ స్టైరిన్ గా మారుస్తారు. ఈ పాలీ స్టైరిన్ ని తయారు చేసే కంపెనీయే ఇప్పుడు విశాఖలో గ్యాస్ దుర్ఘటనకు కారణమైన ఎల్.జి. పాలిమర్స్ కంపెనీ. 

ఈ పాలీ స్టైరిన్ ని మనము రకరకాల పదార్థాలు తయారీకి వాడతాము, డీవీడీ, సీడీలను భద్రపరిచే కవర్లు, వాహనాల నెంబర్ ప్లేట్లు, డిస్పోసబుల్ ప్లేట్లు, గ్లాసులు వంటి అనేక మనరోజువారి పరికరాలను త్యాయారుచేస్తాము.  

అయితే... ఈ స్టైరిన్ గ్యాస్ మాత్రం విషపూరితమైనది. ఇది కాన్సర్ కారకం కూడా. ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన మిథైల్ ఐసో సయనేట్ అంత విషపూరితమైనది అయితే కాదు. కానీ ప్రమాదకారి. 

 ఈ గ్యాస్ ను మనిషి పీల్చాక, ఆక్సీకరణ చెందడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషవాయువును పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఇది అధికంగా చేరుకొని ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. 

కండ్లు విపరీతంగా మంటమండి నీరు కారుతుంది. శరీరం పై మంట పుడుతూ దద్దుర్లు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కొందరిలో తలతిరిగి వాంతులు కూడా అవ్వొచ్చు. మనుషులు ఆ వాయువును అధికంగా పీల్చినప్పుడు కళ్ళు తిరిగి కిందపడిపోయే ప్రమాదం కూడా ఉంది. 

ఇక ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు దాదాపుగా ఆరుగురు మరణించినట్టు తెలియవస్తుంది. వీరు అధికంగా ఈ వాయువును పీల్చ్జడం వల్ల ఆక్సిజన్ అందక మరణించారా, లేదా వీరికి ఇప్పటికే వేరే ఏవైనా జబ్బులు ఉన్నాయా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. 

click me!