తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాని మోడీ..

By SumaBala BukkaFirst Published Nov 27, 2023, 8:08 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. 

తిరుమల : తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో, చైర్మన్ లు ప్రధానికి స్వాగతం పలికారు. 
సోమవారం ఉదయం 8 గం.లకు తిరుమల శ్రీవారిని దర్శించుకోన్నారు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి శ్రీ రచన అతిథి గృహానికి మోడీ చేరుకుంటారు. శ్రీ రచన అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. 9.30గం.లకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రదాని. అక్కడి నుంచి తిరిగి హైదరాబాదుకు చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ రోజు తెలంగాణలో సాయంత్రం మోదీ రోడ్ షోలో పాల్గొంటారు. 

నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల చేరుకున్నారు. ఈ రోజు ఉదయం షెడ్యూల్ ప్రకారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, వేదపండితులు స్వాగతం పలికారు. ప్రధాని హోదాలో నాలుగోసారి ఆయన దర్శనం చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 8 గం.లకు దర్శనం చేసుకోవాల్సి ఉండగా.. ఇంకాస్త ముందుగానే నరేంద్ర మోడీ ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని, కానుకలు సమర్పించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Latest Videos

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం తిరుమలలో మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఆయన అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజస్తంభానికి ప్రధానం చేశారు.  ఆలయ బంగారు వాకిలి ద్వారా లోపలికి ప్రవేశించారు. వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం వకులామాత, విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హుండీలో  కానుకలు వేసి నమస్కరించారు. 

click me!