ప్రతిభా భారతికి పితృవియోగం, జస్టిస్ పున్నయ్య కన్నుమూత

Published : Dec 01, 2018, 11:25 AM IST
ప్రతిభా భారతికి పితృవియోగం, జస్టిస్ పున్నయ్య  కన్నుమూత

సారాంశం

ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తండ్రి,  రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె. పున్నయ్య(96) కన్నుమూశారు.

ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తండ్రి,  రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె. పున్నయ్య(96) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. శనివారం ఉదయం పరిస్థితి విషమించి.. ఆయన కన్నుమూశారు.

వయసు పెరిగిపోవడం, పలు అనారోగ్య  సమస్యల కారణంగా పున్నయ్య అక్టోబర్ 26న ఆస్పత్రిలో చేరారు. అదే సమయంలో ఆయన కుమార్తె ప్రతిభా  భారతికి గుండె నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కి తరలించారు. బైపాస్ సర్జరీ అనంతరం ఆమె కోలుకున్నారు. పున్నయ్య శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి ప్రాంతానికి చెందిన వాడు.

గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గానికి సేవ చేశారు. కాగా.. పున్నయ్య పార్థివ దేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu