పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కి జైలు శిక్ష, జరిమానా

By ramya neerukondaFirst Published Dec 1, 2018, 10:49 AM IST
Highlights

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కి హైదరాబాద్ హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఎస్సీ కార్పొరేషన్‌లో ఉద్యోగులకు సంబంధించిన వివాదంలో హైకోర్టు తీర్పును అమలు చేయని కారణంగా జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్షను విధించడం సంచలనంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కి హైదరాబాద్ హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఎస్సీ కార్పొరేషన్‌లో ఉద్యోగులకు సంబంధించిన వివాదంలో హైకోర్టు తీర్పును అమలు చేయని కారణంగా జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్షను విధించడం సంచలనంగా మారింది.

ఎస్సీ కార్పొరేషన్ లో ఆరుగురు ఉద్యోగుల జితాల విషయంలో వివాదం ఏడాదికాలంగా కొనసాగుతోంది. కాగా.. బాధిత ఉద్యోగులు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై తామిచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని నిర్ధారిస్తూ కోర్టు ధిక్కారం కింద జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. 

ఈ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరువారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ఎం.ఎస్‌.రామచంద్రరావు  ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా ఎస్సీ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఎస్‌.వి.శేషగిరిరావు మరో ఐదుగురు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి జూనియర్‌ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్‌ వచ్చింది. ఆ మేరకు వారు వేతనాలు అందుకుంటున్నారు. అయితే వీరిని నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్‌ చేశారని, అక్రమంగా పదోన్నతులు ఇచ్చారని నిర్ధారిస్తూ వారి వేతనాలు నిలిపివేశారు.

 దీనిపై తమ జీతాల విడుదలకు 2015లో హైకో ర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లకు జీతాలను విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే ఈ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో శేషగిరిరావు తదితరులు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో కోర్టు దిక్కారణ కేసులో జిల్లా ఎస్సీ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. 

click me!