అర్ధరాత్రి ఒంటిగంటకు గుంటూరు కారం షో ... అడ్డుకున్న  గుడివాడ పోలీసులు 

By Arun Kumar PFirst Published Jan 12, 2024, 8:13 AM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం మూవీ బెనిఫిట్ షోను గుడివాడలో పోలీసులు అడ్డుకున్నారు. 

అమరావతి : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంభినేషన్ లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి పండగ బరిలో నిలిచిన ఈ సినిమాను విడుదలకు ముందే చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. మహేష్ అభిమానుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో బెనిఫిట్ షోలు ఏర్పటుచేయగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇదే అదునుగా కొన్ని థియేటర్ల యజమానులు గుంటూరు కారం సినిమాను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కృష్ణా జిల్లా గుడివాడలో ఓ థియేటర్ యాజమాన్యం గుంటూరు కారం సినిమాను అర్ధరాత్రి ప్రదర్శించింది. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా షో ఏర్పాటుచేసారని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులతో కలిసి థియేటర్ వద్దకు చేరుకున్న రెవెన్యూ అధికారులు గుంటూరు కారం షో ను అడ్డుకున్నారు. దీంతో తమ అభిమాన నటుడి సినిమా చూద్దామని థియేటర్ వద్దకు వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. 

Latest Videos

బెనిఫిట్ షో కు అనుమతి లేకపోయినా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయల చొప్పున విక్రయించినట్లు అభిమానులు చెబుతున్నారు. వెంటనే తమ టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే గుంటూరు కారం ప్రీమయర్ షో ను పోలీసులు అడ్డుకున్న వ్యవహారంపై థియేటర్ యాజమాన్యం స్పందించలేదు.

Also Read  Guntur Kaaram Review : గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ... ఘాటు తలకెక్కిందంటున్న నెటిజన్లు..

ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో గుంటూరు కారం మూవీ బెనిఫిట్ షో లకు ఇరు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. దీంతో ఈ బెనిఫిట్ షో టిక్కెట్ ధర రెండు నుంచి మూడువేల వరకు పలికినట్లు తెలుస్తోంది.  ఈ షోలను థియేటర్ ఓనర్స్ నుంచి భారీ రేట్లకు ధర్డ్ పార్టీ లు కొని షోలు వేస్తూంటాయి. తాము పెట్టిన ఇన్వెస్టిమెంట్ రికవరీ కోసం ఈ రేట్లు తప్పవని అంటున్నారు. అంతంత డబ్బులు పెట్టి వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది... అయినా అభిమానంతో ఏదయినా భరిస్తామని సినీప్రియులు అంటున్నారు. 

click me!