ముద్రగడ పద్మనాభం ఈ రోజు సాయంత్రం కొన్ని స్పష్టతలు ఇచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచనల్లో ఉన్నారో సూత్రప్రాయంగా వెల్లడించారు. వైసీపీలోకి వెళ్లే చాన్స్ లేదని స్పష్టం చేశారు. టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్నటి నుంచి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఈ జనవరి 1వ తేదీన తాను, తన కుమారుడు వైసీపీలోకి చేరబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. కానీ, వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ముద్రగడ పద్మనాభం సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జనవరి 4వ తేదీన ముద్రగడకు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కాపు నేతలంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని కోరారు. నిన్న సాయంత్రం జనసేన నేతలు ముద్రగడను కలిశారు. సుమారు గంట సేపు వారు చర్చించారు. ఈ రోజు ఉదయం టీడీపీకి చెందిన కాపు నేతతోనూ ముద్రగడ భేటీ అయ్యారు.
ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ, కాపు నేత త్రిమూర్తులు.. ముద్రగడను కలిసే ప్రయత్నం చేశారు. కానీ, ముద్రగడ అందుకు నిరాకరించారు. తాను తోట త్రిమూర్తులు కలవాలని కోరుకోవడం లేదని, త్రిమూర్తులు ఇక్కడికి వచ్చి ఆయన సమయం వృథా చేసుకోరాదని పేర్కొన్నారు. దీంతో వైసీపీ నేత తన ప్రయత్నాలను విరమించినట్టు తెలిసింది.
Also Read: Mudragada: కాపు నేత ముద్రగడకు వైసీపీ షాక్? ఊరించి ఉసూరుమనిపించిందా?
ఈ రోజు సాయంత్రానికి ముద్రగడ పద్మనాభం నుంచి కొన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది. తాను టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లుతాననే సంకేతాలు ఇచ్చారు. లేదంటే.. ఇంట్లోనూ కూర్చుంటానని పేర్కొన్నట్టు తెలిసింది. కానీ, వైసీపీలోకి వెళ్లే చాన్స్ లేదని స్పష్టం చేశారని కొన్ని వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన వైసీపీలోకి రావాలనే ఉద్దేశంలో లేరని స్పష్టమైంది. వాస్తవానికి ముద్రగడ ఆశించిన మూడు స్థానాల్లోనూ వైసీపీ ఇంచార్జులను ప్రకటించింది. దీంతో కాకినాడ ఎంపీ స్థానం మినహా ముద్రగడకు ఆప్షన్ లేకుండా పోయింది. ఈ తరుణంలోనే ఆయన టీడీపీ లేదా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది.
Also Read: Dry Day: రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట జరిగే జనవరి 22.. ఈ రాష్ట్రాల్లో డ్రై డే
ఈ రెండు పార్టీల్లోనూ దేనిలోకి వెళ్లాలనే అంశంపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఏ పార్టీలోకి చేరితే.. నెరేటివ్ ఎలా ఉండాలనేదానిపైనా ఆలోచనలు చేస్తున్నారు. గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. ఈ రెండు పార్టీల్లోనూ చేరడం వర్కవుట్ కాకుంటే ఇంటికే పరిమితం అవుతానని స్పష్టం చేశారు.