కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు: జగన్ తో పోలీస్ ఉన్నతాధికారుల భేటీ

By narsimha lode  |  First Published Feb 1, 2023, 4:09 PM IST

 నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే   కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి  చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై  హోంశాఖ ఉన్నతాధికారులు  సీఎం జగన్ తో భేటీ అయ్యారు.  ఈ విషయమై  ఏం జరిగిందనే  దానిపై   సీఎంకు  వివరించారు.  


నెల్లూరు: ఫోన్ ట్యాపింగ్  విషయమై   నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చేసిన ఆరోపణలను   సీఎం  జగన్  సీరియస్  గా తీసుకున్నారు. ఈ విషయమై  ఏం జరిగిందనే దానిపై  హోంశాఖ ఉన్నతాధికారులు  సీఎం జగన్  కు వివరించారు.బుధవారం నాడు  మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ తో   సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహదారు  సజ్జల  రామకృష్ణారెడ్డి , , హోం సెక్రటరీ, ఇంటలిజెన్స్ చీఫ్  సీతారామాంజనేయులు తదితరులు  సమావేశమయ్యారు.  తన  ఫోన్ ను   ట్యాపింగ్  చేస్తున్నారని  వైసీపీకి చెందిన  నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ఆరోపణలు  చేశారు.ఈ ఆరోపణలను   వైసీపీ నేతలు ఖండించారు.  తమ పార్టీకి చెందిన  ఎమ్మెల్యే ఫోన్ ను ఎందుకు  ట్యాపింగ్  చేస్తామని  వైసీపీ  రీజినల్ కో ఆర్డినేటర్   బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ప్రశ్నించారు.  

ఫోన్ ట్యాపింగ్  అంశానికి  సంబంధించి  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చేసిన ఆరోపణలను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారని  వైసీపీ వర్గాల్లో ప్రచారంలో  ఉంది.  ఈ విషయమై  ఏం జరిగిందనే విషయమై  జగన్  అధికారులను ఆరా తీశారు. దీంతో  జగన్ తో  హోంశాఖ సెక్రటరీ , ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు   ఇతర పోలీస్ ఉన్నతాధికారులు  ఇవాళ సమావేశమయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశానికి సంబంధించి  ఏం జరిగిందనే దానిపై  సీఎంకు  పోలీసు ఉన్నతాధికారులు   సమాచారం ఇచ్చారు.   కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి వ్యవహరానికి సంబంధించి  రాష్ట్ర హోంశాఖ  ప్రకటన  చేసే అవకాశం ఉంది.

Latest Videos

undefined

జగన్  మంత్రివర్గంలో  చోటు దక్కుతుందని   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి   భావించారు.  అయితే  సామాజిక  సమీకరణాల నేపథ్యంలో   నెల్లూరు జిల్లా నుండి  అనిల్ యాదవ్  కు  మంత్రివర్గంలో చోటు దక్కింది.  మంత్రివర్గ విస్తరణలో   తనకు  చోటు దక్కుతుందని భావించినప్పటికీ  శ్రీధర్ రెడ్డికి  అవకాశం రాలేదు.  శ్రీధర్ రెడ్డికి బదులుగా  కాకాని గోవర్ధన్ రెడ్డికి  మంత్రివర్గంలో  చోటు  దక్కింది.  ఏ కారణాలతో  మంత్రివర్గంలో శ్రీధర్ రెడ్డికి  చోటు  కల్పించని విషయాన్ని  సీఎం జగన్  శ్రీధర్ రెడ్డికి వివరించారు. ఇటీవల క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని   పలు విషయాలపై  శ్రీధర్ రెడ్డితో జగన్ మాట్లాడారు. 

also read:చంద్రబాబుకు ఎవర్ని ఎలా లాక్కోవాలో తెలుసు.. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకే ఈ ఆరోపణలు.. సజ్జల

అయినా కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  వ్యవహర శైలిలో  మార్పు రాలేదు. మరో వైపు  అధికారులపై  విమర్శలు  చేస్తున్నారు. అంతేకాదు  తన ఫోన్ ట్యాపింగ్  చేస్తున్నారని కూడా   ఆరోపించారు. ఈ ఆరోపణలు  నెల్లూరు రాజకీయాల్లో కలకలానికి కారణమైంది. టీడీపీలో  చేరడానికి  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  రంగం సిద్దం  చేసుకున్నారని  వైసీపీ  నేతలు  చెబుతున్నారు. ఈ కారణంగానే తమపై  తప్పుడు ప్రచారం చేసే క్రమంలోనే  ఫోన్ ట్యాపింగ్  ఆరోపణలు  చేస్తున్నారని   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై  వైసీపీ నేతలు  మండిపడుతున్నారు.  నెల్లూరు రూరల్  నియోజకవర్గానికి వైసీపీ  ఇంచార్జీగా  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తప్పించి  మరొకరిని ఇంచార్జీగా  నియమించే అవకాశం లేకపోలేదు. 

click me!