చీరలు కొని బిల్లు కట్టబోనని బెదిరించిన పోలీసు అధికారి భార్య.. కడపలో ఘటన.. వీడియో వైరల్

Published : Aug 28, 2023, 11:01 AM IST
చీరలు కొని బిల్లు కట్టబోనని బెదిరించిన పోలీసు అధికారి భార్య.. కడపలో ఘటన.. వీడియో వైరల్

సారాంశం

ఓ బట్టల షోరూమ్ లో చీరలు కొనుగోలు చేసిన పోలీసు అధికారి భార్య బిల్లు కట్టబోనని మొండికేశారు. తనకెలా బిల్లు ఇస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పోలీసులకు చేరింది. దీంతో సదరు పోలీసు అధికారి ఆ షోరూమ్ కు వచ్చి సమస్యను పరిష్కరించారు.

ఆమె ఓ పోలీసు అధికారి భార్య. ఓ బట్టల షోరూంకు వెళ్లారు. కొన్ని చీరలు కొన్నారు. ప్యాక్ చేయించుకున్నారు. సిబ్బంది బిల్లు చేతిలో పెడితే వారిపై కోపగించుకున్నారు. తాను పోలీసు అధికారి భార్యను అని, తనకు బిల్లు ఎలా ఇస్తారని మండిపడ్డారు. వారిని బెదింరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రాకు గోల్డ్.. ప్రధాని, ఇండియన్ ఆర్మీ అభినందనలు..

‘దక్కన్ క్రానికల్’ కథనం ప్రకారం.. కడప ప్రధాన కార్యాలయంలోని వైవీ స్ట్రీట్ బెటాలియన్ లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి భార్య పట్టణంలోని పలు బట్టల షోరూంలో షాపింగ్ చేస్తుండేవారు. తాను ఓ పోలీసు అధికారి భార్యను అని చెప్పి, ఆమె కొనుగోలు చేసిన చీరలకు డబ్బులు ఎగ్గొట్టేవారు. 

మొదట్లో షోరూం యజమానులు ముందుగా ఒప్పుకున్నారు. కానీ ఆమెకు ఇది అలావాటుగా మారడంతో విసిగిపోయారు. శనివారం మళ్లీ ఓ షోరూంకు వచ్చి చీరలను సెలెక్ట్ చేశారు. అయితే ఈ సారి షో రూం సిబ్బంది ఆమెకు బిల్లు ఇచ్చారు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. తనకు బిల్లు ఇచ్చిన సిబ్బందిని బెదిరించేందుకు ప్రయత్నించారు.

నారాయణపేట కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివ కుమార్ రెడ్డిపై బెంగళూరులో రేప్ కేసు..

ఆమె వ్యవహారంపై విసిగిపోయిన షోరూం యజమానులు.. కడప వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ పోలీసులు ఆ బెటాలియన్ అధికారిని సంప్రదించి.. సమస్యను తెలియజేశారు. వెంటనే ఆ అధికారి షోరూమ్ కు వచ్చారు. భార్యకు కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు.

చంద్రయాన్ -3 : చంద్రుడిపై నుంచి తొలి సైంటిఫిక్ డేటా పంపిన విక్రమ్.. అందులో ఏముందంటే ?

కాగా.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారు బాధ్యతాయుతంగా ఉండాలని, ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడకూడని ఆ వీడియో కింద సోషల్ మీడియా యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?