మాజీ మంత్రి నారా లోకేష్ కు పోలీస్ నోటీసులు... ఎందుకో తెలుసా?

Published : Aug 24, 2023, 12:15 PM ISTUpdated : Aug 24, 2023, 12:25 PM IST
మాజీ మంత్రి నారా లోకేష్ కు పోలీస్ నోటీసులు... ఎందుకో తెలుసా?

సారాంశం

ప్రస్తుతం యువగళం పాదయాత్రలో వున్న టిడిపి యువ నాయకులు నారా లోకేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేసారు. 

గన్నవరం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న వైసిపి నాయకుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇకపై రెచ్చగొట్టేలా, వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయవద్దంటూ పోలీసులు లోకేష్ కు నోటీసులు జారీచేసారు. ఈ నోటీసులు అందించడానికి వెళ్లిన పోలీసులు లోకేష్ ను కలవలేకపోవడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు ఈ నోటీసులు అందించారు. ఆయన ఈ పోలీస్ నోటీసులను లోకేష్ కు అందించారు.   

మాజీ మంతి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ గుడివాడలో కూడా పోలీసులకు పిర్యాదులు అందాయి. నాని,వంశీ లను గుడ్డలూడదీసి కొట్టిస్తానని అవమానకరంగానే కాదు చంపేస్తాననే విధంగా లోకేష్ మాట్లాడారంటూ గుడివాడ వైసిపి నాయకులు పోలీసులకు పిర్యాదు చేసారు. టిడిపి నాయకులను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లోకేష్ మాటలు వున్నాయని పేర్కొన్నారు. లోకేష్ తో పాటు మరికొందరు టిడిపి నాయకులు కూడా ఇలాగే రెచ్చగొట్టేలా మాట్లాడారని... వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైసిపి నాయకులు కోరారు. 

ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. గన్నవరంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ సమక్షంలో వైసిపి నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వైసిపి మాజీ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేపై లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాలతో ఏ సంబంధం లేని తన తల్లిని అవమానించిన కొడాలి నానిని బట్టలూడదీని డ్రాయర్ పైనే రోడ్డుపై తిప్పుతూ కొట్టిస్తానని లోకేష్ హెచ్చరించారు. అలాగే మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీ లపైనా తీవ్ర విమర్శలు చేసారు లోకేష్. 

Read More  నా తల్లినే అవమానిస్తావా... రోడ్డుకీడ్చి డ్రాయర్ పైనే కొట్టుకుంటూ తీసుకెళతాం: కొడాలికి లోకేష్ వార్నింగ్

టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను... వడ్డీతో సహా చెల్లిస్తానని లోకేష్ హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటామని అన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తల్ని వేధించిన వారు కృష్ణా జిల్లాలో ఉన్నా, విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామన్నారు. చట్టాలు అతిక్రమించిన అధికారులపైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు.

ఇలా మాజీ మంత్రులు, ఎమ్మెల్యే వంశీపై  లోకేష్ మాత్రమే కాదు మిగతా టిడిపి నాయకులు కూడా ధ్వజమెత్తారు. దీంతో వైసిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలా అందిన ఓ ఫిర్యాదుపై స్పందిస్తూనే పోలీసులు లోకేష్ కు నోటీసులు జారీ చేసారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!