రామతీర్థంలో నిరసన: మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజుపై నెల్లిమర్లలో కేసు

By narsimha lode  |  First Published Dec 23, 2021, 9:10 AM IST


విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై శ్రీకోదండరామాలయం శంకుస్థాపన సమయంలో విధులకు ఆటంకం కల్గించారని అందిన ఫిర్యాదు మేరకు మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజుపై  నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.


విజయనగరం: మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆశోక్ గజపతిరాజు పై  నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రామతీర్థంలోని బోడికొండపై  శ్రీకోదండరామాలయం శంకుస్థాపన సమయంలో విధులకు ఆటంకం కల్గించారని  ఆలయ ఈఓ నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ ఆశోక్ గజపతిరాజుపై 
473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.Ramatheertham బోడికొండపై శ్రీరాముడి విగ్రహం గత ఏడాది క్రితం ధ్వంసమైంది. అయితే ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ నెల 22 కోదండరామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమం గురించి ఆలయ ధర్మకర్తనైనా తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు తీవ్రంగా మండిపడ్డారు. 

ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు హాజరు కావడానికి ముందే బోడికొండ వద్దకు అనుచరులతో చేరుకొన్న ఆశోక్ గజపతిరాజు నిరసనకు దిగారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని పక్కకు తోసేశారు. ఈ సమయంలో పోలీసులు, అధికారులు Ashok Gajapathi Raju ను అడ్డుకొన్నారు. ఈ సమయంలో అధికారులతో ఆశోక్ గజపతిరాజుకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసకొంది. అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తమాషా చేస్తున్నారు, సర్కస్ చేస్తున్నారని ఆశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్య క్తం చేశారు.శంకుస్థాపన స్థలంలోనే బైఠాయించి నిరసనకు దిగారు. అయితే ఈ సమయంలో  అధికారులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

Latest Videos

undefined

also read:అశోక్ గజపతిరాజుపై దాడి అమానుషం.. టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు

అదే సమయంలో శంకుస్థాపన కార్యక్రమానికి  ఏపీ డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి,ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి Botsa Satyanarayana,ఏపీ దేవాదాయ శాఖ మంత్రి Vellampalli Srinivas, ycp నేతలు అక్కడికి చేరుకొన్నారు. ఆలయానికి శంకుస్థాపన చేసే సమయంలో సర్కస్ చేస్తున్నారంటూ మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు.  ఇలా మాట్లాడొద్దని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యంతరం చెప్పారు. సర్కస్ చేస్తున్నారని మరోసారి రెట్టించి వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు.  శంకుస్థాపన సందర్భంగా కొబ్బరికాయ కూడా కొట్టకుండా తనను మంత్రులు అడ్డుకొన్నారని మాజీకేంద్ర మంత్రి ఆశోకో్ గజపతి రాజు మీడియాకు చెప్పారు. ఆలయ సంస్కృతి,  సంప్రదాయాలను  అధికార పార్టీ విస్మరించిందని ఆయన మండిపడ్డారు.

ఆలయ శంకుస్థాపన జరిగిన తర్వాత మంత్రులు  బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ లు మీడియాతో మాట్లాడారు. ఆశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆలయ ధర్మకర్తగా ఉండి ఏనాడైనా ఆలయ అభివృద్ది కోసం ఆశోక్ గజపతిరాజు పనిచేశాడా అని ప్రశ్నించారు. ఆలయ అధికారులు శంకుస్థాపన సమాచారాన్ని ముందుగానే ఆశోక్ గజపతిరాజుకు అందించారని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. మరోవైపు సర్కస్ అంటూ ఆశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలపై చర్యలుంటాయని మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు.శంకుస్థాపన పూర్తైన తర్వాత ఆలయ ఈఓ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో  ఆశోక్ గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కల్గించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఆశోక గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


 

click me!