వివేకా హత్య కుట్రలో శివశంకర్ రెడ్డే ప్రధాన భాగస్వామి.. ఆధారాలు ధ్వంసం, అసత్యప్రచారం..

Published : Dec 23, 2021, 08:31 AM IST
వివేకా హత్య కుట్రలో శివశంకర్ రెడ్డే ప్రధాన భాగస్వామి.. ఆధారాలు ధ్వంసం, అసత్యప్రచారం..

సారాంశం

వివేకా గుండెపోటుతోనే మరణించారంటూ  అందరినీ నమ్మించేందుకు వీలుగా  పడకగది, బాత్ రూమ్ లోని రక్తపు మరకలు అన్నింటినీ తొలగించేశారని ఘటనా స్థలంలో హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని వివరించింది. ఆ క్రమంలోనే వివేక శరీరంపై ఉన్న గాయాలన్ని గజ్జల జై ప్రకాష్ రెడ్డి అనే కాంపౌండర్ తో బ్యాండేజీ  వేయించి,  కట్లు కట్టించారని తెలిపింది.  

అమరావతి :  మాజీ మంత్రి YS Vivekananda Reddy హత్యకు కుట్ర ఆయన గుండెపోటుతో చనిపోయారు.. అంటూ ప్రచారం చేయాలనే సిద్ధాంతానికి రూపకల్పన చేసిన వారిలో Devireddy Sivashankarreddyది ప్రధాన భాగస్వామి అని సీబీఐ తేల్చింది.  వివేక మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నప్పటికీ ఆయన Heart attackతో చనిపోయాడు.. అంటూ ప్రచారం మొదలు పెట్టింది శివశంకర్ రెడ్డినే అని స్పష్టం చేసింది.  

అదే విషయాన్ని ఆయన  ఓ చానల్ కూడా చెప్పారని వెల్లడించింది. వివేకా గుండెపోటుతోనే మరణించారంటూ  అందరినీ నమ్మించేందుకు వీలుగా  
Bedroom, bathroom లోని Blood stains అన్నింటినీ తొలగించేశారని ఘటనా స్థలంలో హత్యకు సంబంధించిన Evidence destroyed చేశారని వివరించింది. ఆ క్రమంలోనే వివేక శరీరంపై ఉన్న గాయాలన్ని Gajjala Jai ​​Prakash Reddy అనే కాంపౌండర్ తో బ్యాండేజీ  వేయించి,  కట్లు కట్టించారని తెలిపింది.  

వివేకా హత్య కేసులో శివశంకర్రెడ్డి ప్రమేయం ఉందంటూ గత నెల 17న సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. జుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయన బెయిలు మంజూరు కోసం కడప 4 అదనపు జిల్లా జడ్జి న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించగా ఆ పిటిషన్ను న్యాయమూర్తి కొట్టేశారు. అంతకు ముందు దీనిపై వాదనల సందర్భంగా వివేకా హత్య కేసులో శివశంకర్రెడ్డి పాత్రపై తమ దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల్ని న్యాయస్థానం ఎదుట సీబీఐ ఉంచింది. అందులోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి…

దర్యాప్తు పక్కదారి పట్టించేందుకు..
- కొందరు సాక్షులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమై ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నారు. కొత్త కొత్త పేర్లు తెరపైకి తీసుకొస్తున్నారు. దర్యాప్తును  పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే  ఇలా చేస్తున్నారు.

- కుట్రకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం చాలా కీలక దశలో ఉంది. ఇలాంటి దశలో శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఆయన ఆధారాలు తారుమారు చేసి అయ్యే అవకాశం ఉంది. రక్తపు వాంతులు, గుండెపోటుతో చనిపోయారని చెబుతారు.

- వివేకా హత్య కు దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి ఆయన సన్నిహితులు కుట్ర చేశారు. హత్య కు నెల రోజుల ముందే దీనికి రూపకల్పన జరిగింది. వివేకాను చంపితే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానని యాదటి సునీల్ యాదవ్,  గజ్జల ఉమా శంకర్ రెడ్డి,  షేక్ దస్తగిరి లకు శివశంకర్రెడ్డి ఆఫర్ చేశారు.

- వివేక గుండెపోటుతో చనిపోయాడు.. ఆయన ఇంటి వద్ద భారీగా జనం గుమిగూడి ఉన్నారు. వెంటనే అక్కడికి వచ్చి నియంత్రించాలి.. అంటూ పులివెందల సీఐను శివశంకర్రెడ్డి సంప్రదించారు.

- ‘వివేక గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారని మేము చెబుతాం.. ఈ వ్యవహారంలో నోరు మూసుకుని ఉండాలి’ అంటూ సీఐ  శంకరయ్యను, ఘటనా స్థలంలోని సాక్షుల్ని శివ శంకర్ రెడ్డి  దుర్భాషలాడారు.

- రక్తపు మరకలు శుభ్రం చేస్తున్న సందర్భంలోనూ, గాయాలకు బ్యాండేజీ వేసి కట్లు  కడుతున్న సమయంలోనూ లోపలి నుంచి తలుపులు వేశారు. శివ శంకర్ రెడ్డి,  ఆయన సన్నిహితులు ఆదేశాల మేరకు అలా చేశారు.

- వివేక మృతి వార్త తెలిసి అక్కడికి వచ్చిన వారందరినీ,  ఆయన రక్తపువాంతులు, గుండెపోటుతో చనిపోయారు అని పేర్కొంటూ  శివ శంకర్ రెడ్డి, ఆయన సన్నిహితులు నమ్మించారు.

హత్య చేస్తే రూ. 40 కోట్లు..

- ‘వివేకాను హత్య చేస్తే దేవిరెడ్డి శివశంకర్రెడ్డి మనకు రూ. 40 కోట్లు ఇస్తారు. దీనివెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు’ అంటూ ఎర్ర గంగిరెడ్డి,  సునీల్ యాదవ్,  ఉమా శంకర్ రెడ్డి,  షేక్ దస్తగిరి లతో చెప్పినట్లు దస్తగిరి,  వాచ్మెన్  రంగన్నలు  వాంగ్మూలం ఇచ్చారు.

కేశినేనికి కీలక బాధ్యతలు: బుద్ధా అలక, దిగొచ్చిన చంద్రబాబు.. ఉత్తరాంధ్ర టీడీపీ పగ్గాలు వెంకన్న చేతికి

- హత్యకు నాలుగైదు రోజుల ముందు sunilyadav దస్తగిరి కి అడ్వాన్స్ గా కోటి రూపాయలు ఇచ్చారు.  ఆ మొత్తంలో నుంచి 25 లక్షల రూపాయలు  మళ్లీ ఇస్తానని చెప్పి తీసుకున్నారు.

- దస్తగిరికి అడ్వాన్సుగా అందిన డబ్బును  ఆయన  మున్నా వద్ద ఉంచారు.  అందులో రూ. లో 46.70 లక్షలు  మున్నా నుంచి  స్వాధీనం చేసుకున్నాం.
 
సీబీఐ ఎదుట తమ పేర్లు చెప్పవద్దంటూ దస్తగిరి ని ప్రభావితం చేశారు
 - ఈ కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరిని శివశంకర్రెడ్డి ఈ ఏడాది మార్చిలో తన స్నేహితుడైన భయపు రెడ్డి ఇంటికి పిలిపించారు. ‘సీబీఐ ఎదుట  నా పేరు కానీ, మిగతా వారి పేర్లు కాని చెప్పొద్దు. అలా చేస్తే నీ జీవితాన్ని  సెటిల్ చేస్తా’  అంటూ దస్తగిరికి చెప్పారు.

- వివేకా హత్య  కుట్రలో శివశంకర్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారు. ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేశారు. ఆయనను నవంబర్ 17న అరెస్టు చేశాం. జుడిషియల్ రిమాండ్ లో ఉండగానే న్యాయస్థానం అనుమతి తీసుకోకుండా కడప కేంద్ర కారాగారం నుంచి ఆయనను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?