CPI Narayana: అమిత్ షా పర్యటన.. సీపీఐ నారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాకింగ్ చేస్తుండగానే..

By team teluguFirst Published Nov 14, 2021, 10:53 AM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో (amit shah tirupati tour) ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను (cpi narayana) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో (amit shah tirupati tour) ఉన్న సంగతి తెలిసిందే. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కోసం అమిత్ షా శనివారం రాత్రి తిరుపతి చేరుకున్న సంగతి తెలిసిందే. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అంతేకాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను (cpi narayana) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి బైరాగిపట్టెడలో వాకింగ్ చేస్తుండగా పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

కొద్ది రోజుల క్రితం సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. తిరుపతి పర్యటనకు వస్తున్న అమిత్ షాను అడ్డుకుంటామని అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం రూ. 5 తగ్గించిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Also read: పట్టు పంచె, నుదుట తిలకం... అచ్చతెలుగు వస్త్రధారణలో అమిత్ షా... శ్రీవారి ధర్శనం (ఫోటోలు)

ఇక, మూడు రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. అక్కడ అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ (ys jagan) స్వయంగా స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రోజా తదితరులు ఉన్నారు.

Also read: దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం : రేణిగుంటకు చేరుకున్న అమిత్ షా.. స్వాగతం పలికిన జగన్

అనంతరం అమిత్ షాతో సీఎం జగన్ ఇతర నాయకులు శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అమిత్ షా తిరుమల పద్మావతి అతిథిగృహానికి చేరుకుని.. అక్కడే భోజనం చేశారు. అనంతరం తిరుపతి తాజ్ హోటల్‌కు చేరుకుని బస చేశారు. ఇక, ఆదివారం అమిత్ షా అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వర్ణ భారతి ట్రస్టు 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం తిరుపతికి చేరుకుని దక్షిణాది జోనల్ కౌన్సిల్‌ బేటీలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, లెఫ్టినెంట్ గవర్నర్ లు కూడా పాల్గొననున్నారు. ఈ భేటీ అనంతరం ఆదివారం రాత్రి అమిత్ షా తాజ్ హోటల్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 

click me!