మహిళా దినోత్సవం రోజున ఆందోళన... రాజధాని మహిళలపై పెట్టిన సెక్షన్లివే...

By Arun Kumar PFirst Published Mar 9, 2021, 2:31 PM IST
Highlights

మహిళా దినోత్సవం రోజున ఆందోళనకు దిగిన మహిళలు, రైతులపై పలు సెక్షన్ల కింద పోలీస్ కేసులు నమోదయ్యాయి.

అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆందోళనకు దిగిన రాజధాని మహిళలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమరావతి నుండి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లడానికి రాజధాని మహిళలు, రైతులు ప్రయత్నించడం... వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చెలరేగగా ఈ పరిస్థితికి కారణమయ్యారని పోలీసులు ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. 

మల్కాపురం జంక్షన్‌ వద్ద జరిగిన ఆందోళనకు సంబంధించి వై.మల్లీశ్వరి, జి. ప్రభావతి, కె.గోవిందమ్మ, బి. ప్రియాంక, కె. శిరీషా, పి. రాధిక, పి. సుధాకర్‌, జి.మార్టిన్‌, ఎ.మనోజ్‌, ఎ.రాజేష్‌, పి.రమేష్‌, రాయపాటి శైలజ, శివారెడ్డి, బి. సాంబశివరావు, డి. సుధాకర్‌, వై. భూషయ్య, కె.జగన్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. Cr.no 64/2021 U/S 143, 188, 332 353, 506, 509, R/W 149 ఐపీసీ సెక్షన్ల కింద తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. 

వీడియో  మహిళా దినోత్సవం రోజునే... రోడ్డెక్కిన రాజధాని మహిళలు

మందడం లైబ్రరీ సెంటర్‌లో ఆందోళనకు సంబంధించి వై.మల్లీశ్వరి, జి. ప్రభావతి, కె.గోవిందమ్మ, బి. ప్రియాంక, కె. శిరీషా, పి. రాధిక, రాయపాటి శైలజ, పి. సుధాకర్‌, ఎ. రాజేష్‌, బి.రమేష్‌, బి.సుధాకర్‌, వై. భూషయ్య, శివారెడ్డి, బి. సాంబశివరావులపై కేసులు నమోదు చేశారు. Cr.no 63/2021 U/S 143, 188, 353, 506, 509, R/W 149 ఐపీసీ సెక్షన్ల కింద తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. 

 
 

click me!