రాజీనామాలకు భయపడడం లేదు, కానీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సజ్జల

By narsimha lode  |  First Published Mar 9, 2021, 1:44 PM IST

రాజీనామాలకు తాము భయపడడం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేస్తే తాము పోటీకి అభ్యర్ధులను పెట్టమని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనను ఆయన స్పందించారు.



విజయవాడ: రాజీనామాలకు తాము భయపడడం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేస్తే తాము పోటీకి అభ్యర్ధులను పెట్టమని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనను ఆయన స్పందించారు.

మంగళవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో కొత్తదనం లేదన్నారు.

Latest Videos

స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ ప్రధాని మోడీకి మరో లేఖ రాసినట్టుగా ఆయన చెప్పారు. ఈ ప్లాంట్  ప్రైవేటీకరణ కాకుండా  ఆపేందుకు ప్రభుత్వపరంగా  చేయాల్సిన  ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయమార్గాలను సీఎం సూచించారని ఆయన గుర్తు చేశారు.

ఇక్కడ ఎన్నికల్లో పోటీకి ఎవరూ భయపడడం లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 నుండి 90 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకొన్న పార్టీ మాది అని ఆయన గుర్తు చేశారు. రాజీనామాలకు తాము భయపడడం లేదన్నారు. ఎఫ్పుడు ఏం చేయాలో అనే విషయమై తాము చర్చిస్తున్నామన్నారు.

స్టీల్ ప్లాంట్ అనేది వందశాతం కేంద్రం ఆధీనంలోని పరిశ్రమ అని ఆయన గుర్తు చేశారు.స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదన్నారు.విశాఖలో భూముల విలువ భాగా పెరిగిందని ఆయన గుర్తు చేశారు.  మెడమీద తల ఉన్నవారు ఎరవైనా జగన్ సూచనలన్ని తప్పుపట్టరని ఆయన చెప్పారు.

also read:విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం: మోడీ అపాయింట్‌మెంట్ కోరిన జగన్

బీజేపీతో మిత్రత్వం నెరుపుతున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై కూడ ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడకుండా రాష్ట్రానికి వచ్చి ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన ప్రశ్నించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.


 

click me!