వైసిపి రాక్షసులతో పోరాటం... రేణుకకు అన్నగా అండదండలు: లోకేష్ హామీ

Arun Kumar P   | Asianet News
Published : Mar 09, 2021, 01:48 PM ISTUpdated : Mar 09, 2021, 01:51 PM IST
వైసిపి రాక్షసులతో పోరాటం... రేణుకకు అన్నగా అండదండలు: లోకేష్ హామీ

సారాంశం

బైరిశెట్టి రేణుక ధైర్యానికి సలామ్... వైకాపా రాక్షసులపై ఆమె పోరాటానికి అన్నగా అండగా ఉంటానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. 

అమలాపురం: అధికార వైసిపి నాయకుడు తనయుడి చేతిలో మోసపోయానంటూ అమలాపురంకు చెందిన ఎంబిఎ యువతి బైరిశెట్టి రేణుక ఆవేదనతో ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. తనకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఫోటీ చేస్తున్నట్లు యువతి తెలిపింది. ఈ వ్యవహారంపై  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ రేణుక ధైర్యానికి మెచ్చుకున్నారు. 

వీడియో

 

 ''అమలాపురంలో బైరిశెట్టి రేణుక ధైర్యానికి సలామ్. వైకాపా రాక్షసులపై ఆమె పోరాటానికి అన్నగా అండగా ఉంటా. అన్యాయం జరిగింది అని కేసు పెడితే ఈ రోజు వరకూ యాక్షన్ లేదు. బుల్లెట్ లేని వైఎస్ జగన్ ఎక్కడ?'' అని లోకేష్ ప్రశ్నించారు. 

''స్వయంగా మంత్రులే మృగాళ్లను కాపాడటానికి రంగంలోకి దిగితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ?21 రోజుల్లో బాధిత మహిళకు న్యాయం అన్నారు. 21 నెలలు అయినా ఒక్క మహిళకూ న్యాయం జరగలేదు. జగన్ రెడ్డి హయాంలో తనకి జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకి జరగకూడదు అంటూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ముందుకు రావడం స్ఫూర్తిదాయకం. రేణుకను మోసం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు'' అని లోకేష్ ట్వీట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!