నారాలోకేశ్‌పై బెజవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

By Siva KodatiFirst Published Jun 19, 2021, 3:02 PM IST
Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేశ్‌పై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేశ్‌పై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సందర్భంగా పరామర్శ కోసం సూర్యారావుపేట కోర్టు సెంటర్‍కు నారా లోకేశ్ వెళ్లారు. ఈ సమయంలో నారా లోకేశ్ కరోనా నిబంధనలు పట్టించుకోలేదని ఆయనపై పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ నారా లోకేశ్, కొల్లు రవీంద్ర తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read:అచ్చెన్నాయుడు కుటుంబానికి ఫోన్... చంద్రబాబు, లోకేష్ హామీ

ఏపీ ఈఎస్‌ఐలో వెలుగుచూసిన భారీ కుంభకోణం నేపథ్యంలో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందట. ఈఎస్ఐ డైరెక్టర్లు రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. మొత్తం రూ.988 కోట్లకు సంబంధించి రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగిందని గుర్తించారు. ఈ కేసులో కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అచ్చెన్నాయుడు బెయిల్‌పై విడుదలయ్యారు. 

click me!