టీడీపీకి శవ రాజకీయాలు చేయడం అలవాటే.. అదేబాటలో లోకేష్ కూడా.. : సుచరిత

By AN Telugu  |  First Published Jun 19, 2021, 1:57 PM IST

టీడీపీ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యలపై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం హేయమైన చర్య అన్నారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీ అధికారంలోకి వస్తే హత్యలు చేస్తామని చెప్పకనే చెబుతున్నట్లు ఉందని హోంమంత్రి సుచరిత మండిపడ్డారు.

వ్యక్తిగత కారణాలతోనే కర్నూలు ఘటన జరిగిందని ప్రజలే చెప్తున్నారని హోం మంత్రి సుచరిత అన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిపద్ధతి కాదని హోం మినిస్టర్ హితవు పలికారు. వ్యక్తిగత కారణాలను కూడా టిడిపి రాజకీయ లబ్ధి కోసం సుచరిత వాడుకుంటోందని అన్నారు.

Latest Videos

టీడీపీ నాయకులకు శవ రాజకీయాలు చేయడం అలవాటైందని సుచరిత మండిపడ్డారు. ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని హోంమంత్రి సుచరిత అన్నరు.

తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదని హోం మినిస్టర్ స్పష్టంచేశారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ లని కూడా చూడకుండా ప్రతిఒక్కరికీ మంచి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని హోంమంత్రి కొనియాడారు.

టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చలేదు కనుకనే ఘోరమైన ఓటమి పొందారన్నారు. టీడీపీ హయాంలో జరిగిన రాజకీయ హత్యల గురించి ప్రజలందరికీ తెలుసునని మండిపడ్డారు సుచరిత. ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న మంచి పేరును చూసి టీడీపీ ఓర్వలేక పోతోందన్న హోంమంత్రి సుచరిత ఎద్దేవా చేశారు. 

click me!